
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
సుల్తానాబాద్‌రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ర చించిన రాజ్యాంగానికి కేంద్ర ప్రభుత్వం ముప్పు తెచ్చేలా పాలిస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపించారు. జైబీమ్.. జై బాపు.. జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మే రకు ఐతరాజుపల్లె నుంచి భూపతిపూర్ వరకు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ కుట్రలను ప్రజలకు వివరించేందుకే పాదయాత్ర చేపట్టామని తెలిపారు. నాయకులు అన్నయ్యగౌడ్, ఈర్ల స్వరూప, ప్రకాశ్‌రావు, తిరుపతిరెడ్డి, గండు సంజీవ్, సారయ్యగౌడ్, చిలుక సతీశ్ పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే విజయరమణారావు రేగడిమద్దికుంట, అల్లిపూర్ గ్రామాల్లో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసి మాట్లాడారు.
క్రికెట్ పోటీల విజేత పోలీస్ జట్టు
పెద్దపల్లిరూరల్: ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో చేపట్టిన క్రికెట్ పో టీలు ముగిశాయి. ఫైనల్ పోటీల్లో పోలీసు జ ట్టుతో వెటర్నరీ డాక్టర్స్ జట్టు తలపడగా.. పోలీ సు జట్టు విజయం సాధించి ట్రోఫీని కైవసం చే సుకుంది. విజేతకు ట్రోఫీతో పాటు రూ.50వేల నగదును ఎమ్మెల్యే విజయరమణారావు అందజేశారు. పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే విజయరమణారావు