
భూగర్భ డ్రైనేజీకి డీపీఆర్
● రోడ్ల నిర్మాణానికీ ప్రతిపాదనలు తయారు చేయండి ● రామగుండం సుందరీకరణకు అందరూ సహకరించండి ● ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సూచన
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగర సుందరీకరణకు సహకరించాలని ఎమ్మెల్యే మ క్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, మున్సిపల్ అధికారులను కోరారు. నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై కార్పొరేషన్ కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ తో కలిసి సోమవారం బల్దియా కార్యాలయంలో సమీక్షించారు. వేసవి దృష్ట్యా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణానికి డీపీఆర్ తయారు చే యాలని సూచించారు. రూ.200 కోట్ల అంచనా తో 27 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు త్వ రలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. రాజీ వ్ రహదారికి ఇరువైపులా ల్యాడ్ స్కేపింగ్ చేయాలని, తద్వారా సర్వీస్ రోడ్లు నిర్మిస్తారని తెలిపా రు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. 2ఏ మోరీ, ఫైవింక్లయిన్ మోరీలను కలుపుతూ రోడ్డు నిర్మించి వర్షాకాలంలో వరద నిల్వకాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అవసరమైనచోట్ల వీధిదీపాలు ఏర్పాటు చేయాలని, శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించే శ్రీరామ నవమి వేడుకలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, సింగరేణి ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, ఆర్‌ఎఫ్‌సీఎల్ డీజీఎం రమేశ్ ఠాకూర్, సీనియర్ మేనేజర్ వెంకటరెడ్డి, సింగరేణి ఎస్‌ఈ (సివిల్) వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
హనుమమాన్ విగ్రహ నిర్మాణం పరిశీలన
రామగుండం: శ్రీరామునిగుండాల కొండపై చేపట్టిన 108 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ ఆదివారం రాత్రి పరిశీలించారు.