
ఆర్మీలో చేరాలని ఉందా..!
● అయితే, స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరుకండి ● కలెక్టర్ చొరవ.. యువతకు ఉచిత శిక్షణ ● సైన్యంలో ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు.. ● ఎన్టీపీసీ, సింగరేణి సంస్థల సహకారం
ఉచిత శిక్షణ సమాచారం
దరఖాస్తు చేసినవారు : 458 ఇప్పటివరకు శిక్షణకు ఎంపికై నవారు: 153 దరఖాస్తుల స్వీకరణ గడువు : ఈనెల10 దరఖాస్తుల స్వీకరణ పద్ధతి : ఆన్‌లైన్
పెద్దపల్లిరూరల్: త్రివిధ దళాల్లో యువశక్తి సంఖ్య పెంచాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన అగ్నివీర్ ద్వారా సైన్యంలో చేరేందుకు ముందుకొచ్చే యువతకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఇందుకోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వారందరికీ జిల్లాలోని పోలీసు, వైద్యశాఖల అధికారులు, సిబ్బంది సహకారంతో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తున్నారు. ఆన్‌లైన్ పద్ధతిలో ఈనెల 10వ తేదీ వరకూ ఆసక్తిగల మరికొందరిని ఎంపిక చేస్తామని అధికారులు వెల్లడించారు.
అగ్నిపథ్ – 2022లో..
ఇండియన్ ఆర్మీలో పనిచేసేందుకు 17.5 ఏళ్ల – 21 ఏళ్ల లోపు వయసు గల యువతను అర్హులుగా నిర్ణయించారు. వీరు నాలుగేళ్లపాటు దేశరక్షణలో పాలుపంచుకోవాలి. ఈమేరకు అగ్నిపథ్ పథకాన్ని కేంద్రప్రభుత్వం 2022 జూన్ 14వ తేదీన అమలులోకి తీసుకొచ్చింది. అదేఏడాది సెప్టెంబర్ నుంచి త్రివి ధ దళాల్లోకి 100 మంది అధికారులు, వెయ్యిమంది సైనికుల నియామకానికి శ్రీకారం చుట్టింది. కోవిడ్ మహమ్మరితో నియామక ప్రక్రియ నిలిచిపోయయింది. దీంతో త్రివిధ దళాల్లో ఖాళీలను భర్తీ చేయలేకపోయారు. ఆ కొరతను అధిగమించేందుకు అగ్నివీర్ ద్వారా ఎంపికై న యువతకు ఆర్నెల్లపాటు శిక్షణ ఇస్తారు. మిగతా మూడున్నర ఏళ్లపాటు దేశ సేవకు వినియోగించుకుంటారు.
పరీక్షలకు సిద్ధం చేసేలా..
అగ్నివీర్ ద్వారా ఆర్మీ(సైన్యం)లో జనరల్ డ్యూటీ(జీడీ), టెక్నికల్, అసిస్టెంట్, ట్రేడ్స్‌మెన్, సోల్జర్, సి ఫాయి, ఫార్మాలో చేరాలనే ఆలోచనతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించి ఉచిత శిక్షణ ఇ ప్పించేలా కలెక్టర్ శ్రీహర్ష కార్యాచరణ చేపట్టారు. ఇందుకోసం ముగ్గురు అధికారుల(డీఎంవో ప్రవీ ణ్‌రెడ్డి, డీవైఎస్‌వో సురేశ్, గోదావరిఖని ఏసీపీ రమే శ్)తో కమిటీ ఏర్పాటు చేశారు. ఆసక్తి గలవారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారిలో అర్హులను ఎంపిక చేసేందుకు వారం క్రితం స్క్రీనింగ్ టెస్ట్ ని ర్వహించారు. ఇందులో ఎంపికచేసిన వారికి గోదా వరిఖనిలోని సింగరేణి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూ పొందించారు. అగ్నివీర్ ద్వారా సైన్యంలోకి యువ తను ఎంపికకు అనుసరించే పద్ధతులు, పరీక్షలను ఇక్కడి అధికారులు పక్కాగా నిర్వహిస్తారు. అభ్యర్థుల్లో ఆత్మస్థయిర్యం పెంపొందించి ఆర్మీలో ఉద్యోగం సాధించేలా శిక్షణ ఇస్తున్నారు.
అర్హులనే ఎంపిక చేశాం
యువత ఆర్మీలో ఉద్యోగాలు సాధించేలా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అర్హులను ఎంపిక చేసి ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆర్మీలో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో 458 మంది వివరాలు తెలుసుకున్నాం. అందులోని ఆసక్తిగలవారికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాం. 153 మందిని అర్హులుగా తేల్చాం. అర్హులు ఇంకా ఎవరైనా ఉంటే ఉచితంగా శిక్షణ ఇప్పిస్తాం.
– ప్రవీణ్‌రెడ్డి, ఉచిత శిక్షణ కేంద్రం కో ఆర్డినేటర్
నమ్మకం కుదిరింది
ఆర్మీలో చేరాలనే ఆశతో అగ్నివీర్ ద్వారా దరఖాస్తు చేసుకున్న. జిల్లాలో అగ్నివీర్ దరఖాస్తుదారుల్లో అర్హులకు ఉచిత శిక్షణ ఇస్తారని తెలుసుకుని ఇక్కడకు వచ్చా. స్క్రీనింగ్ టెస్ట్‌లో ఎంపికై న. ఉద్యోగం వస్తుందన్న నమ్మకం కుదిరింది. సైన్యాధికారులు చేపట్టే పరీక్షలకు ఇక్కడ శిక్షణ పొందుతున్నం.
– బొంకూరి మనోజ్, నందిమేడారం
ఉద్యోగావకాశాల కోసం ..
ఆర్మీలో చేరాలనే ఆశతో అగ్నివీర్‌కు దరఖాస్తు చేసుకున్న యువతకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు దక్కేలా ఉచిత శిక్షణ ఇప్పించాలని నిర్ణయించాం. ఇందుకు ఎన్టీపీసీ, సింగరేణి సంస్థల సహకారం తీసుకుంటున్నాం. గోదావరిఖని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శిక్షణ ఇప్పిస్తూ, సమీపంలోని క్లబ్‌లో వసతి కల్పించా లని ప్రాథమికంగా నిర్ణయించాం.
– కోయ శ్రీహర్ష, కలెక్టర్

ఆర్మీలో చేరాలని ఉందా..!

ఆర్మీలో చేరాలని ఉందా..!

ఆర్మీలో చేరాలని ఉందా..!

ఆర్మీలో చేరాలని ఉందా..!

ఆర్మీలో చేరాలని ఉందా..!