పోటాపోటీగా ఆవిర్భావ వేడుకలు
పెద్దపల్లిరూరల్: బీజేపీ ఆవిర్భావ వేడుకలను ఆదివారం మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారె డ్డి, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలో వేర్వేరుగానే నిర్వహించా రు. గుజ్జుల.. పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డితో కలిసి స్థానిక బస్టాండ్ వద్ద పతాకం ఆవిష్కరించారు. దుగ్యాల ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలోనూ పార్టీ మండల అధ్యక్షుడు వేల్పుల రమేశ్ (నిమ్మనపల్లి), పట్టణ అధ్యక్షుడు రాకేశ్ (చందపల్లి) ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ జిల్లా అ ధ్యక్షుడు సంజీవరెడ్డి ఈ కార్యక్రమాల్లోనూ ప్రదీప్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు.
ఆధిపత్య పోరు తప్పేదెన్నడు?
బీజేపీలో ఆధిపత్యపోరు ఇంకా సాగుతూనే ఉంది. పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఇది మరోసారి బహిర్గతమైంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, అటు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఇటు దుగ్యా ల ప్రదీప్‌కుమార్‌తో కలిసి వేడుకల్లో పాల్గొనడం గమనార్హం. గుజ్జుల, దుగ్యాల వర్గీయుల ఆధిప త్య పోరును ఆపేందుకు అధిష్టానం చొరవ చూప కపోవడంతో భవిష్యత్‌లో పార్టీపై ప్రభావం చూ పే అవకాశం ఉందని నేతలు చర్చించుకుంటున్నా రు. కేంద్రమంత్రి సంజయ్ చొరవతో అధ్యక్ష పదవిని దక్కించుకున్న సంజీవరెడ్డి.. ఇటీవల జిల్లా కమిటీని ప్రకటించిన కొద్దిగంటల్లోనే రద్దు చేసే పరిస్థితులు తలెత్తిన విషయం విదితమే.
బీజేపీలో చల్లారని అసంతృప్తి జ్వాలలు
పోటాపోటీగా ఆవిర్భావ వేడుకలు
పోటాపోటీగా ఆవిర్భావ వేడుకలు


