
పాపా.. హాస్టల్‌లో ఏమైనా సమస్యలు ఉన్నాయా?
రామగుండం: ‘పాపా.. హాస్టల్‌లో ఏమైనా సమస్యలు న్నా.. ఉంటే నా ఫో న్‌నంబరుకు సమా చారం ఇవ్వండి.. నేనే హాస్టల్‌కు వ చ్చి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తా.. మీరు బు ద్ధిగా చదువుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలి’ అని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ సూచించారు. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహాన్ని ఆయన సోమవారం సందర్శించారు. పరిసరాలు, విద్యాబోధన తదితర వాటిపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. తానున్నానని భరోసా కల్పించారు.
గ్రామాల్లో సన్నబియ్యం పంపిణీ
అంతర్గాం మండలం ముర్మూర్, మొగల్‌పహాడ్ గ్రా మాల్లో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ సన్నబి య్యం పంపిణీ చేశారు. ప్రత్యేకాధికారి రవీందర్‌ప టేల్, ఆర్‌ఐ శ్రీమాన్, కాంగ్రెస్ ప్రతినిధులు సంగణవేణ శేఖర్, సుంకరి రవి, మేకల స్వామి, నాజి యా సుల్తానా, చిలుక రామ్మూర్తి పాల్గొన్నారు.
కార్పొరేషన్‌లో విలీనం చేయొద్దు
గోదావరిఖని: లింగాపూర్ గ్రామాన్ని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దని ఆ గ్రామస్తులు కోరారు. ఈమేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్‌కు వినతిపత్రం అందజేశారు.