ఏటీసీని పూర్తిచేయండి | - | Sakshi
Sakshi News home page

ఏటీసీని పూర్తిచేయండి

Published Sat, Apr 5 2025 1:47 AM | Last Updated on Sat, Apr 5 2025 1:47 AM

ఏటీసీ

ఏటీసీని పూర్తిచేయండి

పెద్దపల్లిరూరల్‌: ఐటీఐ సెంటర్‌లోని ఏటీసీ భవన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఐటీఐ ప్రాంగణంలో చేపట్టిన ఏటీసీ భవనం పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 6 ట్రేడ్‌లతో యువతకు ఉపాధి శిక్షణ అందించేందుకు అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ భవన నిర్మాణం, పరికరాల అమరిక పనులు వేగవంతం చేయాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సన్నబియ్యం పంపిణీ ప్రారంభం

పాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్‌తోపా టు రామగుండం ఎస్టీకాలనీలో ఎమ్మెల్యే మ క్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ శుక్రవారం సన్నబి య్యం పంపిణీ ప్రారంభించారు. రాజ్‌ఠాకూర్‌ మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వివిధ గ్రామాల కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నారు.

హైటెన్షన్‌ లైన్‌ తొలగిస్తాం

జ్యోతినగర్‌(రామగుండం): రామగుండం–బీ పవర్‌హౌస్‌ నుంచి ఎఫ్‌సీఐ వరకు విద్యుత్‌ సరఫరా లేని 132 కేవీ లైన్‌ తొలగింపునకు ట్రాన్స్‌కో ఉత్తర్వు లు విడుదల చేసిందని ఎ ఫ్‌సీఐ వెల్ఫేర్‌ సొసైటీ కన్వీనర్‌ పి.భగవాన్‌రా వు శుక్రవారం తెలిపారు. ఆరు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించిందన్నారు. ఇందుకోసం 18 శాతం జీఎస్టీతో కలిపి రూ. 68,94,790.85 ఫీజును వివిధ దశల్లో చెల్లించాలని ఉత్తర్వులో ఆదేశించిందని పేర్కొన్నా రు. రామగుండం– బీ పవర్‌ హౌస్‌ నుంచి ఎఫ్‌సీఐ వరకు 31 పెద్ద, 20 చిన్నటవర్లు కలిపి సుమారు 7 కి.మీ. పరిధిలో ఉన్నాయన్నారు.

14 వరకు గడువు పొడిగింపు

పెద్దపల్లిరూరల్‌: రాజీవ్‌ యువ వికాసం పథ కం కోసం లబ్ధి పొందేందుకు ఈనెల 14వ తే దీ వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. ఆఫ్‌లైన్‌ కోసం మండల పరిషత్‌ కార్యాలయం/ మున్సిపల్‌ కార్యాలయాల్లోని ప్రజా పాలన కౌంటర్‌లో దరఖాస్తులు అందుబాటు లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఆక్రమణదారుపై ఎఫ్‌ఐఆర్‌

మంథని మండలం దుబ్బపల్లి శివారు సర్వే నంబర్‌ 173లోని 10 ఎకరాల ప్రభుత్వ భూ మిలో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేశామని, ఈనెల 3న ఆవునూరు భానుచందర్‌ అందు లోని 4 ఎకరాల్లో చెట్లు కొట్టివేసి చదును చే శారని కలెక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. ఆర్‌ఐ ఫిర్యా దు మేరకు పోలీసులు భానుచందర్‌పై వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారన్నారు.

పేదలకు నాణ్యమైన భోజనం

ధర్మారం(ధర్మపురి): పేదలకు నాణ్యమైన ఆ హారం అందించాలనే సంకల్పంతో తమ ప్ర భుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. కటికెనపల్లి, నందిమేడారంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలి సి శుక్రవారం విప్‌ సన్నబియ్యం పంపణీ చేశా రు. లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ, ప్రభుత్వంపై ఆర్థికభారం పడినా పేదలకు నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యమన్నారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, తహసీల్దార్‌ వకీల్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లావుడ్య రూప్లానా యక్‌, వైస్‌ చైర్మన్‌ అరిగే లింగయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, యువ జన కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరుపతి పాల్గొన్నారు.

‘జమిలి’పై అవగాహన కల్పించాలి

గోదావరిఖని: జమిలి ఎన్నికలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రవెల్లి రఘునాథ్‌, అల్జపూర్‌ శ్రీనివాస్‌ సూ చించారు. బీజేపీ జిల్లాస్థాయి సమావేశం శుక్రవారం స్థానిక శారదానగర్‌లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతీబూత్‌ స్థాయిలో జెండా ఎగురావేయాలన్నారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఏటీసీని పూర్తిచేయండి 1
1/3

ఏటీసీని పూర్తిచేయండి

ఏటీసీని పూర్తిచేయండి 2
2/3

ఏటీసీని పూర్తిచేయండి

ఏటీసీని పూర్తిచేయండి 3
3/3

ఏటీసీని పూర్తిచేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement