
కులం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు
నేను ఎస్టీ కులానికి చెందిన సునితను ఆదర్శ వివాహం చేసుకున్న. మా పిల్లల చదువులకు కుల ధ్రువీకరణపత్రం కావాలని కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న. కానీ, సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. విచారణ జరిపి మాకు కులం సర్టిఫికెట్ ఇప్పించి న్యాయం చేయాలి.
– కల్వల కోమల్, మీర్జంపేట
రేషన్‌కార్డులో పేరు చేర్చాలి
మాకు రేషన్ కార్డు ఉంది. అందులో నా భార్య అనుప్రియ పేరు చేర్చాలని ఏడాదికిపైగా దరఖాస్తు చేసుకుంటున్న. అయినా, పేరు చేర్చడం లేదు. విచారణ జరిపి రేషన్‌కార్డులో నా భార్య పేరు చేర్చాలి.
– రామయ్య, అనుప్రియ, భూపతిపూర్

కులం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు