
ఇదే చి‘వరి’ తడి
● గడువు ముగిసింది.. అయినా నేటినుంచి ఎస్సారెస్పీ నీరు అందిస్తాం ● అన్నదాతలు సాగునీటిని వృథా చేయొద్దు ● ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లిరూరల్: చివరి ఆయకట్టుకు ఇదేచివరి తడి అని, గురువారం(ఈనెల 10) నుంచి ఎస్సారెస్పీ కాలువల ద్వారా పంటలకు సాగునీరు సరఫరా చేస్తున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యాసంగిలో పండిస్తున్న వరి, మొక్కజొన్న తదితర పంటలకు సాగునీరు అవసరమని గుర్తించి సీఎం రేవంత్‌రెడ్డి, డెప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ డి–83, డి–86 కాలువల ద్వారా సరఫరా అయ్యే నీటిని రైతులు అవసరం మేరకు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
బాధితుడికి బాసటగా నిలిచి..
అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన ఎలబోతారం రమేశ్ కుటుంబానికి విజ్జన్న యువసేన వ్యవ స్థాపకుడు అల్లం వినోద్‌రెడ్డి ఆర్థికసాయం అందించడంతో భూంనగర్ ప్రాంతంలోని లాండ్రీ షాపును ఎమ్మెల్యే విజయరమణారావు పునఃప్రారంభించా రు. నాయకులు జగదీశ్, శ్రీనివాస్, సంపత్, అమ్రే శ్, సుభాష్‌రావు, డీవీఎస్‌మూర్తి, అస్లాం ఉన్నారు.
ప్రమాదబీమా చెక్కు అందజేత
ఓదెల(పెద్దపల్లి): గోపరపల్లె గ్రామానికి చెందిన యాసం మణెమ్మకు పొత్కపల్లి సొసైటీ ద్వారా మంజూరైన రూ.లక్ష విలువైన ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. నాయకులు పాల్గొన్నారు.
ఎలిగేడు మండలంలో ఎమ్మెల్యే పాదయాత్ర
ఎలిగేడు(పెద్దపల్లి): ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బుధవారం ర్యాకల్‌దేవ్‌పల్లి నుంచి రా ములపల్లి గ్రామం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. నాయకు లు ప్రకాశ్‌రావు, రాజేశ్వర్‌రెడ్డి, నర్సింహయాదవ్, వెంకటేశ్వర్‌రావు, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.