
దాహం తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు
పెద్దపల్లిరూరల్: ఎండల తీవ్రత అధికంగా ఉందని, బస్సు ప్రయాణికులతోపాటు కలెక్టరేట్‌కు పనుల నిమిత్తం వచ్చే వివిధ ప్రాంతాల ప్రజల దాహం తీర్చేందుకు చల్లని తాగునీటిని అందించేందుకే చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని క లెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. చలివేంద్రంలో చల్లని నీటిని అందుబాటులో ఉంచి ఇక్కడికి వ చ్చే వారికి అందించాలని అన్నారు. ఏవో శ్రీనివాస్, డీఎంవో ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.
వెలుగుతున్న విద్యుత్ దీపాలు
పెద్దపల్లిరూరల్: స్థానిక అ మర్‌నగర్(పాతకోర్టు) చౌర స్తా వద్ద ఏర్పాటు చేసిన జెండాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. సుందరీకరించిన ప్రాంతంలో విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జెండాలు తొలగించి, ఫ్లెక్సీలు కూడా తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
‘యువికా’కు విద్యార్థిని ఎంపిక
పాలకుర్తి(రామగుండం): కన్నాల జెడ్పీ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న తోడేటి సాయివర్షిత ఇస్రో యంగ్ సైంటిస్ట్ శిక్షణ(యువికా)కు ఎంపికైంది. మేలో ఇస్రోకు చెందిన 7 పరిశోధన కేంద్రాల్లో అంతరిక్ష సాంకేతికత, అనువర్తనాలపై రెండువారాల పాటు ఆవాస శిక్షణ ఇస్తారు. ఇందుకు సాయివర్షిత ఎంపిక కావడంపై ప్రధానోపాధ్యాయుడు కమలాకర్‌రావు, జిల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ డిపోకు మరో భవనం
పెద్దపల్లిరూరల్: జిల్లా తూనికలు, కొలతల శా ఖ కార్యాలయాన్ని ఖాళీ చేయించి ఆ భవనాన్ని కూడా ఆర్టీసీ బస్‌డిపోకు అప్పగించారు. తూని కలు, కొలతల శాఖ కార్యాలయాన్ని కలెక్టరేట్‌లోకి ఇటీవల మార్చారు. పాలశీతలీకరణ కేంద్రం, జిల్లా పశుసంవర్థక శాఖ కార్యాలయాలు ఇంకా తమ సొంతభవనాల్లోనే పనిచేస్తున్నాయి. వాటిని కూడా తొలగిస్తారనే ప్రచారం ఉంది. అయితే పాలశీతలీకరణ కేంద్రం పాడి రైతులకు అనువుగా ఉందని, భవనం కూడా ఇటీవలే నిర్మించిందని ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలుస్తోంది. పశుసంవర్థక శాఖ కార్యాలయాన్ని కూడా త్వరలోనే ఖాళీ చేయించే అవకాశాలున్నట్లు సమాచారం.
పత్తి క్వింటాల్ రూ.7,359
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,359 ధర పలికింది. కనిష్టంగా రూ.5,511, సగటు రూ.7,033గా ధర నిర్ధారించామని ఇన్‌చార్జి కార్యదర్శి మనోహర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
23 వరకు దరఖాస్తుల స్వీకరణ
పెద్దపల్లిరూరల్: గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 23వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈవో మాధవి తెలి పారు. రాష్ట్రంలో 35 గురుకుల జూనియర్ కాలేజీలు(20 బాలికలు, 15 బాలుర) ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని, దరఖాస్తుదారులకు మే 10న ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయిస్తారన్నారు. ఆదిలాబాద్, వరంగల్, ఖ మ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మ హబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ కేంద్రాల్లో పరీక్ష ఉంటుందని, వివరాల కోసం 040–24734899 ఫోన్‌నంబరులో సంప్రదించాలని తెలిపారు.

దాహం తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు

దాహం తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు

దాహం తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు