శివలింగంపై సూర్యకిరణాలు
రామగుండం: అంత ర్గాం మండలం రా యదండి శ్రీచిలుకలరామేశ్వరాలయంలో సోమవారం శివలింగంపై నేరుగా సూర్య కిరణాలు పడ్డాయి. దీంతో భక్తులు దివ్య దర్శనం చేసుకున్నా రు. శివుడికి ప్రత్యేక దినమైన సోమవా రం కావడంతో శివలింగంపై సూర్య తిల కం దిద్దుతున్నట్లు భావించి పూజలు చేశారు.
వ్యాధులను దూరం చేద్దాం
పెద్దపల్లిరూరల్: పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధులను దూ రం చేసి ఆరోగ్యంగా ఉండాలని జిల్లా వైద్య, ఆ రోగ్యశాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి అన్నా రు. ప్రపంచ ఆరోగ్యదినోత్సవం సందర్భంగా తన కార్యాలయంలో సోమవారం ఆమె విలేక రులతో మాట్లాడారు. మాతా, శిశువులు ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన పద్ధతు లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. మహిళల్లో వ్యాధులను గుర్తించి నయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రధానంగా రక్తహీనత నియంత్రణకు అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
రోజూ వ్యాయామం చేయండి
జ్యోతినగర్(రామగుండం): ప్రతీరోజు వ్యా యామం చేస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుంద ని ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత అన్నారు. ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప ర్మినెంట్ టౌన్‌షిప్‌లో సోమవారం చేపట్టిన మా ర్నింగ్‌వాక్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ధన్వంతరీ ఆస్పత్రిలో జరిగిన కార్యక్ర మంలో మాట్లాడారు. ఉద్యోగులు, వారి కు టుంబాల శ్రేయస్సు లక్ష్యంగా ముందుకు సా గుతున్నామన్నారు. జనరల్ మేనేజర్లు, విభా గాధిపతులు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ లహిరి, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
స్వల్పంగా పెరిగిన పత్తి ధర
పెద్దపల్లిరూరల్: జిల్లాలో పత్తి ధర స్వల్పంగా పెరిగింది. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,311 ధర పలికింది. కనిష్టంగా రూ.5,208, సగటు రూ.7,008 ధర నిర్ణయించినట్లు మార్కెట్ కార్యదర్శి మనోహర్ తెలిపారు. పలువురు రైతుల నుంచి 183 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా
పెద్దపల్లిరూరల్: వేసవి దృష్ట్యా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈ మాధవరావు సూచించారు. జిల్లాలోని డీఈ, ఏడీఈ, ఏఈఈలతోపాటు అన్ని విభాగాల అధికారుల తో సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన స మావేశయ్యారు. అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా కార్యాచరణ చేపట్టాలని అన్నారు. లోడ్ పెరిగే ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏ ర్పాటు చేయాలని, సాంకేతిక సమస్యలు తలెత్తితే సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వసూళ్లలో కంపెనీ పరిధిలోని 16 సర్కిళ్లలో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు సహకరించిన అధికారులందరినీ ఆయన అభినందించారు.
ప్రతీ సమస్యను పరిష్కరించుకుందాం
గోదావరిఖని: అధికార పార్టీ, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రతీ సమస్యను పరిష్కరించుకుందామని ఐఎన్‌టీయూసీ ఆర్జీ–2 ఉపాధ్యక్షు డు శంకర్‌నాయక్ అన్నారు. సోమవారం ఓసీపీ–3 ఎస్‌అండ్‌డీ సెక్షన్‌లో ఏర్పాటు చేసిన స మావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి సాధనకు గుండెకాయ ఎస్‌అండ్ డీ సెక్షన్ అని అన్నారు. నాయకులు రవీందర్‌రెడ్డి, కొంగర రవీందర్, అక్రమ్, కొత్త సత్య నారాయణరెడ్డి, దశరథంగౌడ్, ఐరెడ్డి సంపత్‌రెడ్డి, సాలిగామ మల్లేశ్, సంపత్‌రెడ్డి తదితరు లు పాల్గొన్నారు. అనంతరం ఎస్‌అండ్‌డీ హెచ్ వోడీ జనార్దన్‌కు వినతిపత్రం అందజేశారు.
శివలింగంపై సూర్యకిరణాలు
శివలింగంపై సూర్యకిరణాలు


