
ప్రజాసమస్యలు పరిష్కరించండి
ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: గోదావరిఖని బల్దియాలోని 49 వ డివిజన్‌లో రోడ్డు ఆక్రమించి ప్రహరీ నిర్మిస్తు న్నారు.. దీనిని తొలగించాలని స్థానికుడు ప్రసాద్ కోరారు. అదేవిధంగా తన పేరిట కాగజ్‌నగర్‌లో రేషన్‌కార్డు ఉందని, ఆ రేషన్ కార్డును తాను నివా సం ఉండే పెద్దపల్లి జిల్లాలోని కమాన్‌పూర్ ప్రాంతానికి మార్చాలని కల్వల జయ విన్నవించింది. ఇలా.. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలు, గోడును అర్జీల రూపంలో కలెక్టర్ కోయ శ్రీహర్షకు విన్నవించారు. వారి ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్.. సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో సోమవారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి ప్రజావాణి ద్వారా ఆయన ఫిర్యాదులను స్వీకరించారు.