
దేశీయ మొక్కలు నాటాలి
మానవాళికి, పక్షులకు ప్రమా దకరంగా మారిన కోనోకార్పస్ మొక్కలను తొలగించి, వాటి స్థానంలో ఆక్సిజన్ విడుదల చేసే దేశీయ మొక్కలను నాటాలి. తద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, ఆరోగ్యకరమైన జీవవైవిధ్యాన్ని పెంపొందించవచ్చు. గోదావరిఖనిని పొల్యూషన్ బారినుంచి కాపాడుకోవడమే కాకుండా సుందరీకరణకు అవకాశం ఉంటుంది.
– పిట్టల రాజ్‌కుమార్,
మదర్ హ్యూమన్ యూత్ సొసైటీ అధ్యక్షుడు
ఉపయోగం లేదు
అందం, ఆకర్షణ తప్ప కోనోకార్పస్ మొక్కలతో ఎలాంటి ఉపయోగం లేదు. మానవాళికి విషంగా తయారైన కోనోకార్పస్ మొక్కలను అధికారులు తొలగించాలి. వీటి ఆకులను పశువులు సైతం తినవు. డివైడర్లపై ఎక్కడ చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి. నిత్యం ప్రజలు సంచరించే ప్రాంతా ల్లో ఉన్న మెక్కలను తొలగించి దేశీయ మొక్కలను పెంచాలి.
– సూర్య శ్యాం, సుల్తానాబాద్
ప్రజారోగ్యంపై ప్రభావం
కోనోకార్పస్ మొక్కలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆకుల నుంచి వెలువడే పరాగ రేణువులతో ప్రమాదకర అలర్జీ వస్తుంది. ఆస్తమా అధికం అవుతుంది. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు గురవుతాం. టీబీ పేషెంట్లకు ఇవి అత్యంత ప్రమాదకరం. ప్రపంచ దేశాలు తొలుత ప్రోత్సహించినా.. అనర్థాలు వెలుగులోకి రావడంతో ఈ మొక్కలను నిషేధించాయి.
– డాక్టర్ పిల్లి కిరణ్,
సాయిల్ సైంటిస్ట్, కృషి విజ్ఞాన కేంద్రం

దేశీయ మొక్కలు నాటాలి

దేశీయ మొక్కలు నాటాలి