
అగ్రిమెంట్‌లో ఆలస్యం
● పీపీఏ కోసం పలు రాష్ట్రాల ఆసక్తి ● ముందుకు రాని రాష్ట్రప్రభుత్వం ● నిర్లక్ష్యం చేస్తే 85 శాతం యాక్సెస్ లాస్ అయ్యే అవకాశం ● తెలంగాణ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్–2లో కొనసాగుతున్న అనిశ్చితి
జ్యోతినగర్(రామగుండం): రామగుండం ఎన్టీపీ సీలో చేపట్టిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్–2పై అనిశ్చితి నెలకొంది. రాష్ట్ర వి భజన చట్టం ప్రకారం తెలంగాణలో 4వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం నిర్మించేందుకు నిర్ణయించింది. ఒక్కోటి 800 మె గావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన రెండు యూనిట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో రాష్ట్రప్రభు త్వం 80శాతం వినియోగిస్తోంది. స్టేజ్–2 కింద చేపట్టే మిగిలిన 2,400 మెగావాట్ల మూడు యూ నిట్ల ప్రాజెక్టులో తయారయ్యే విద్యుత్ ఉత్పత్తిలో కొనుగోలు ఒప్పందం (పీపీఏ)పై రాష్ట్రప్రభుత్వం ఇంకా సంతకం చేయడం లేదు. దీంతో ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు పొరుగు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ఆ రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి కొనుగోలు చేసుకుంటే.. మన రాష్ట్రం అందులోని 85శాతం విద్యుత్‌ను కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ముందుకొస్తున్న రాష్ట్రాలు..
దేశంలోని కొన్ని రాష్ట్రాలు పవర్ ప్రాజెక్టును దక్కించుకునేందుకు ముందుకొస్తున్నాయి. వాటి తో పీపీఏ ఒప్పందం చేసుకునేందుకు కరెంట్ కా ర్పొరేషన్ సిద్ధమవుతోంది. ఇలా అయితే.. తెలంగాణ స్టేజ్–2లో ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 85 శా తం యాక్సెస్‌ను మనరాష్ట్రం కోల్పోయే ప్రమా దం ఉంది. ఇదే విషయంపై ఎన్టీపీసీ గతేడాది రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణ ప్రా జెక్టు స్టేజ్–2 కోసం పవర్ పర్చేజ్(పీపీఏ)పై సంతకం చేయాలని విన్నవించింది. సంతకం చేయడంలో ఆలస్యమైతే తెలంగాణ ప్రాజెక్టు నుంచి విద్యుత్ కోల్పోయే ప్రమాదం ఉందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి గతేడాది రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూడా. అయినా పరిస్థితిలో మార్పు రావడంలేదు.