
‘పీఎం సూర్యఘర్’ను సద్వినియోగం చేసుకోండి
పెద్దపల్లిరూరల్: రాష్ట్రంలో రెడ్‌కో ద్వారా పీఎం సూ ర్యఘర్, ముఫ్త్ బిజిలీ యోజన పథకం అమలవుతోందని, జిల్లా ప్రజలకు దీనిపై అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని క లెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో పథకాల అమలుతీరుపై మంగళవారం సమీక్షించారు. ఇంటి పైభాగంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొస్తే ప్రభుత్వం రాయితీ అందిస్తుందన్నారు. 2 కిలోవాట్స్ ప్లాంట్ ద్వారా 150 యూనిట్ల వరకు(రూ.60వేల సబ్సిడీ), 3కిలో వా ట్స్‌కు 300(రూ.78వేల సబ్సిడీ) యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చన్నారు. రెడ్‌కో ద్వారా అందించే రాయితీలపై ప్రజలకు అవగాహన కలి గేలా ప్రచారం చేయాలని అన్నారు. అదనపు వి ద్యుత్ ఉత్పత్తి చేస్తే గ్రిడ్‌కు విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చని వివరించారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందినీ, లీడ్‌బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
జనవరి వరకు తహసీల్దార్ భవనం పనులు..
జిల్లాలోని ఏడు మండలాల్లో చేపట్టిన తహసీల్దార్ భవన నిర్మాణాలను వచ్చే ఏడాది జనవరి వరకు పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించా రు. వివిధ అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష ని ర్వహించారు. మంథనిలో రూ.4.5కోట్లతో చేపట్టిన సమీకృత కార్యాలయాలను వచ్చే ఉగాది నాటికి పూర్తిచేయాలన్నారు. పాఠశాల, హాస్టల్, సబ్ సెంట ర్ల పనుల పురోగతిపై ఆయన ఆరా తీశారు. పనుల ను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈఈ గిరిశ్‌బాబు, డీఆర్డీవో కాళిందిని పాల్గొన్నారు.