
పరుగెత్తితే పతకమే..
● క్రీడా పోటీల్లో ‘మోడల్’ విద్యార్థుల సత్తా ● రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్న చిన్నారులు ● అభినందిస్తున్న క్రీడాభిమానులు
వాలీబాల్‌లో సత్తా
ఇంటర్ సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న సింధూ అండర్–19 వాలీబాల్ పోటీల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ విజయవాడలో నిర్వహించిన జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో సత్తా చాటింది.
– బి.సింధూ
పట్టుదలతోనే
ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న శరణ్య రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో రాణించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. అండర్–19లో మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాలో ఈనెల 15 నుంచి 21 వరకు నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతోంది.
– బైకని శరణ్య
ఆనందంగా ఉంది
తొమ్మిదో తరగతి చదువుతున్న మనోజ్ఞ ఎస్‌జీఎఫ్ అండర్ –17లో ఇటీవల మెదక్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. జమ్ముకాశ్మీర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటడం ఆనందంగా ఉంది.
– తుమ్మల మనోజ్ఞ
ధర్మారం(ధర్మపురి): వాళ్లు పల్లెవాసులు.. క్రీడా నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చారు.. ఎక్క డా తర్ఫీదు కూడా తీసుకోలేదు.. కానీ, చదువుతోపాటు ఆటల్లోనూ రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటుతు న్నారు ధర్మారం తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు. పీఈటీ కొమురయ్య, ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ ప్రోత్సాహంతో మెలకువలు నేర్చుకుంటున్నారు. ఈ విద్యాలయం నుంచి ఏటా 40 నుంచి 50 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి, ఐదుగురు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. 2024–25 సంవత్సరంలో జాతీయస్థాయి పోటీలకు ఆరుగురు విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన క్రీడాకారులతో తలపడి ఆద్భుత రికార్డులో నమోదు చేస్తున్నారు. వివిధ పట్టణాలు, నగరాల్లో నిర్వహించే రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు సొంత ఖర్చులతోనే వెళ్తూ పతకాలు సాధిస్తున్నారు.
పట్టుదలతోనే సాధ్యం
పీఈటీ ప్రోత్సాహంతో సాఫ్ట్‌బాల్‌పై ఆసక్తి పెంచుకున్న. పట్టుదలతో ఆడుతూ రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి పోటీలకు చేరుకున్న. మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రాణించడం సంతోషంగా ఉంది.
– బండి వైష్ణవి
జాతీయ స్థాయిలో ప్రతిభ
ఎనిమిదో తరగతి చదువుతున్న ఓరం సౌజ్ఞ అథ్లెటిక్స్ అండర్ –14లో జాతీయ స్తాయికి ఎదిగింది. ఆమె పరుగెత్తుతే పతకం ఖాయం. రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయికి ఎదిగి గుజరాత్ హమ్మదాబాద్‌లో జరిగిన పోటీల్లో సత్తాచాటింది. – ఓరం సౌజ్ఞ

పరుగెత్తితే పతకమే..

పరుగెత్తితే పతకమే..

పరుగెత్తితే పతకమే..

పరుగెత్తితే పతకమే..

పరుగెత్తితే పతకమే..