
ఉక్కపోత.. దోమల మోత
● విద్యుత్ సరఫరాలో అంతరాయం
● సింగరేణి కార్మికులకు నిద్రాభంగం ●
● సబ్‌స్టేషన్‌లో సిబ్బంది లేక అవస్థలు
● పోతనకాలనీ సమస్యలు పట్టని సింగరేణి యాజమాన్యం
ఇబ్బంది పడుతున్నం
ఏదైనా కారణంతో కరెంట్ సరఫరా ఆగిపోతే పునరుద్ధరించేవారు లేరు. అసలే ఎండకాలం. ఉక్కపోతగా ఉంటుంది. దోమలు కుడుతున్నయి. చిన్నపిల్లలు, ముసలోళ్లు చాలా ఇబ్బంది పడుతున్నరు.
– సౌమ్య, పోతనకాలనీ
వెంటనే నియమించాలి
కరెంట్ పోతే కారణం చె ప్పేందుకు, ఎప్పుడు వస్తు ందనే సమయం చెప్పేందు కు ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదు. సింగరేణి యాజమాన్యం స్పందించి వెంటనే ఎలక్ట్రీయషన్‌ను నియమించాలి.
– లావణ్య, పోతనకాలనీ
త్వరలోనే నియమిస్తాం
ఆర్జీ–2 ఏరియాలోని పోతనకాలనీ విద్యుత్ సబ్ స్టేషన్ ఎలక్ట్రీషియన్ ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. ఆ పోస్టు కొన్ని నెలల నుంచి ఖాళీగా ఉంది. సమస్య పరిష్కరిస్తాం. ఇందుకోసం త్వరలోనే ఎలక్ట్రీషియన్‌ను నియమిస్తాం.
– ఎర్రన్న, ఏజీఎం, ఆర్జీ–2
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): విధులు నిర్వర్తించి ఇళ్లకు చేరుకునే సింగరేణి కార్మికులను ఉక్క పోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దోమలు ఎడాపెడా వా యిస్తున్నాయి. ఫలితంగా సెకండ్, నైట్‌డ్యూ టీ చేసి వచ్చిన వారు సరిగి నిద్రపోవడంలేదు. ఫస్ట్, బీ– తదితర షిఫ్ట్‌లు చేసిన వారికీ విశ్రాంతి తీసుకోవడం గగనంగా మారుతోంది. ఇదంతా స్థానిక పోతనకాలనీలోని దుస్థితికి అద్దంపడుతోంది.
సిబ్బంది లేరు.. తరచూ సమస్యలు..
సింగరేణి ఆర్జీ–2 ఏరియా పరిధిలోని పోతనకాలనీలో 85 బ్లాక్‌లు, వాటి పరిధిలో 1,180 క్వార్టర్లు ఉ న్నాయి. ఇందులోని 1,180 కార్మిక కుటుంబాలు ని వాసం ఉండగా, దాదాపు 3వేల మందికి పైగా జనా భా ఉంటుంది. వీరి కోసం సమీపంలోనే సింగరేణి యాజమాన్యం 33/3.3 కేవీ సామర్థ్యంతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించింది. కానీ, అందులో సిబ్బందితోపాటు ఎలక్ట్రీషియన్‌ను నియమించలేదు.
గంటల తరబడి నిరీక్షణ..
ఏదోఒక కారణంతో విద్యుత్ సరఫరాలో అంతరా యం ఏర్పడితే మరమ్మతు చేసేందుకు సిబ్బంది ఎవరూ అందుబాటులో ఉండడంలేదు. దీంతో గంటల తరబడి సరఫరా నిలిచి కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఉదయంపూట కరెంట్ సరఫరా ఆగిపోతే ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. అసలే వేసవి.. ఆపై ఉక్కపోత.. రాత్రివేళ దోమల మోత.. కార్మిక కుటుంబాలేకాదు.. కార్మికులకూ నిద్రాభంగం కలుగుతోంది. తద్వారా పనిస్థలాల్లో సరిగా విధులు నిర్వర్తించే పరిస్థి తి ఉండదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎలక్ట్రీషియన్ పోస్టు ఖాళీ..
పోతనకాలనీ సబ్‌స్టేషన్‌లో నియమించిన ఎలక్ట్రీషియన్ నాలుగు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. దీంతో ఎలాంటి సమస్య తలెత్తినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. సమాచారం కోసం సబ్‌స్టేషన్‌కు వెళ్లినా ఎవరూ అందుబాటులో ఉండడంలేదు. తాళం వేసిన కార్యాలయమే దర్శనమిస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యైటింక్లయిన్‌కాలనీ సబ్‌స్టేషన్‌లో పనిచేసే ఎలక్ట్రీషియన్.. అక్కడ విధులు ముగించుకుని పోతనకాలనీకి వస్తేనే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా కరెంట్ కోసం కార్మిక కుటుంబాలు నిరీక్షించాల్సి వస్తోంది. రాత్రివేళ విద్యుత్ సరఫరా ఆగిపోతే.. ఆ రోజంతా జాగారం చేయడమేనని కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
అధికారులు స్పందించాలి
పోతనకాలనీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఎలక్ట్రీషియన్‌ను వెంటనే నియమించాలి. కరెంట్ పోతే కార్మిక కుటుంబాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అధికారులు ఇప్పటికై నా స్పందించాలి.
– పద్మ, పోతనకాలనీ
సిబ్బందిని నియమించాలి
గోదావరిఖని: మహాకవిపోతనకాలనీలో విద్యుత్ సిబ్బంది లేక కా ర్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని ఐఎన్‌టీయూసీ ఆర్జీ– 2 ఉపాధ్యక్షుడు బదావత్ శంకర్‌నాయక్ అన్నారు. శనివారం ఆర్జీ–2 జీఎం వెంకటయ్య, ఎస్‌వోటూ జీఎం రాముడు, వర్క్‌షాప్ ఏజీఎం ఎర్రన్నకు వినతిపత్రం అందజేశారు. ఎలక్ట్రీషియన్ లేక కాలనీ రోజుల తరబడి చిమ్మచీకట్లో ఉంటోందని తెలిపారు. తద్వా రా దొంగల బెడద పెరిగిందన్నారు. నాయకులు నాచగోని దశరథంగౌడ్, సాలిగామ మల్లేశ్, ఆకుల రాజయ్య, తోకల సమ్మయ్య, గోపాల్‌రావు, వంగ సురేశ్, శ్రీనివాస్, మధు పాల్గొన్నారు.

ఉక్కపోత.. దోమల మోత

ఉక్కపోత.. దోమల మోత

ఉక్కపోత.. దోమల మోత

ఉక్కపోత.. దోమల మోత