
నైపుణ్యాలు పెంచేందుకే
నేటి పోటీ యుగానికి అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలు పెంచాలన్న ఉద్దేశంతో సమీకృత గురుకులాలు ప్రారంభిస్తున్నాం. మార్కెట్‌లో నిలదొక్కుకునేలా నిపుణులైన మానవ వనరులను విద్యార్థి దశ నుంచే తీర్చిదిద్దుతాం. అందుకే, అత్యాధునిక సదుపాయాలతో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఉంటాయి. త్వరలో రామగుండం, పెద్దపల్లి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు కూడా మొదలవుతాయి.
– మంత్రి శ్రీధర్‌బాబు