
కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ
స్కానింగ్ సెంటర్లు, మెటర్నిటీహోంలలో తనిఖీలు నిర్వహించేందుకు కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వైద్యాధికారి కన్వీనర్‌గా కమిటీ రూపొందించారు. కమిటీలో గైనకాలజిస్టు, మహిళా తహసీల్దార్, మహిళా పోలీస్ అధికారి, సఖి కన్సల్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ను బాధ్యులుగా నియమించారు. వీరంతా జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లలో ఎప్పటికప్పుడు తనిఖీ చేపట్టాలి. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు చేపడతారు. ఈ కమిటీ ఇప్పటికే 19 సెంటర్లకు నోటీసులు జారీ చేసింది.
– డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్‌వో, కరీంనగర్