
ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయండి
కరీంనగర్‌టౌన్: వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ప్రాంతాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ (ఎస్‌ఏఎస్‌సీఐ) పథకం కింద నిధులను మంజూరు చేయాలని విన్నవించారు. సిరిసిల్ల లేదా సిద్దిపేట జిల్లాల్లో సైనిక్‌స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విన్నవించారు. ఈమేరకు న్యూఢిల్లీలో బుధవారం కలిసి వినతిపత్రాలు అందించారు. కేంద్రం సైనిక్‌స్కూల్‌ను మంజూరుచేస్తే భూమి, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
సైనిక్‌స్కూల్ మంజూరు చేయండి
కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, గజేంద్రసింగ్ షెకావత్‌లకు బండి సంజయ్ వినతి