
మధ్యాహ్నం మద్యం తాగితే..
‘ఒక్క బీరు తాగితే ఏమైతంది సారూ.. ఎండ బాగా కొడుతుందని సల్లదనం కోసం ఒకేఒక్క బీరు తాగిన సారూ..’ ఓ మందుబాబు ప్రశ్న ఇది. ట్రాఫిక్ పోలీసులకు ఇలాంటి వింత సమాధానాలు రావడం విసుగెత్తిస్తోంది. ఎండలు దంచికొడుతుండడంతో మందుబాబులు మధ్యాహ్నం వేళ ‘చల్లని మద్యం’ ఎడాపెడా తాగేస్తూ రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అయితే, బ్రీత్ ఎనలైజర్‌తో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయడంతో ఎంచక్కా దొరికిపోతున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ ట్రాఫిక్ పోలీసులు చలాన్లు రాస్తూ ‘సాక్షి’కి ఇలా కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి