రాయితీ విడుదల కాలేదు
పెద్దపల్లిరూరల్: ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ కింద 2018లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికి యూనిట్ మంజూరైనా రాయితీ వి డుదల కాలేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం పలు జిల్లాల కలెక్టర్లతో రాజీవ్ యువ వికాసంపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, గతంలో దరఖాస్తు చేసుకుని స బ్సిడీ మంజూరు కాని దరఖాస్తులను తిరస్కరించి, మరోసారి దరఖాస్తు చేసుకునేలా అ వకాశం కల్పించామన్నారు. దీంతో డిప్యూటీ సీఎం కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
4న భక్తాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం
రామగుండం: పట్టణంలోని శ్రీభక్తాంజనేయస్వామి ఆలయ వార్షికోసత్సవం ఈనెల 4వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆ లయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తామని పూజారి కమ్మల చంద్రశేఖరశర్మ తెలిపారు.
సేవలతోనే గుర్తింపు
పెద్దపల్లిరూరల్: అంకితభావంతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలు ఎప్పటికీ మ ర్చిపోరని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి అన్నారు. రాఘవాపూ ర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెచ్‌ఈవో సాంబయ్య సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా వైద్యురాలు మమ త అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమంలో సాంబయ్యను సత్కరించారు. ప్రతీ ఉద్యోగి విధులను సక్రమంగా నిర్వర్తించాలని, సేవలతో నే గుర్తింపు లభిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలని డీఎంహెవో సూచించారు. జిల్లా మలేరియా అధికారి శ్రీరాములు, డాక్టర్ శ్రీవాణి, కిరణ్‌కుమార్, రాజమొగిలి తదితరులు పాల్గొన్నారు.
నేడు కవి సమ్మేళనం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో మంగళవా రం ఉగాది కవిసమ్మేళనం నిర్వహిస్తామని ఉ దయ సాహితీ గౌరవ అధ్యక్షుడు దాస్యం సే నాధిపతి, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మయ్య, జిల్లా క న్వీనర్ ఏలేశ్వరం వెంకటేశ్వర్లు, కో కన్వీనర్ బుర్ర తిరుపతి తెలిపారు. జిల్లా రచయితల సంఘం, ఉదయ సాహితీ సంయుక్తంగా ని ర్వహించే ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు మొదలవుతుందని, కవులు, రచయితలు హాజరు కావాలని వారు కోరారు.
రాయితీ విడుదల కాలేదు


