పాలపొరకతో ఊరేగింపు
పాలకుర్తి(రామగుండం): వివిధ గ్రామాల్లో ఆ దివారం నిర్వహించనున్న శ్రీసీతారాముల క ల్యాణ మహోత్సవానికి ఉత్సవ కమిటీలు ఏ ర్పాట్లు చేశాయి. బసంత్‌నగర్, పాలకుర్తి, కొత్తపల్లి, రామారావుపల్లి, పుట్నూర్, కుక్కలగూడూర్, జీడీనగర్, బామ్లానాయక్‌తండా, కన్నా ల, రాణాపూర్ గ్రామాల్లోని రామాలయాలతో పాటు ఆంజనేయస్వామి ఆలయాలను పచ్చనితోరణాలు, విద్యుత్ దీపాలతో అలంకరించా రు. కల్యాణంలో తొలిఘట్టం పాలపొరక కార్యక్రమం నిర్వహించారు. ఎడ్లబండ్లు, బైక్‌లపై పాలపొరకను ఊరేగింపుగా తీసుకు వచ్చి గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు.
‘రైల్వే’ ఎన్నికలు ప్రశాంతం
రామగుండం: ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్, రామగుండం బ్రాంచి అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికలు శనివా రం ప్రశాంతంగా జరిగాయి. రామగుండం బ్రాంచి పరిధిలోని ఆర్మూర్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాఘవపురం, రామగుండం, పెద్దంపేట, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో పని చేసే రైల్వే ఉద్యోగులు సుమారు 101 ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో 85 మంది ఓటుహ క్కు వినియోగించుకున్నారు. రామగుండం బ్రాంచి అధ్యక్షుడిగా బి.కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా మాతంగి దినేశ్, కోశాధికారిగా పుల్లూరి లక్ష్మణ్ ఎన్నికయ్యారు. ఈ ప్యానల్ కాలపరిమితి మూడేళ్లు ఉంటుంది.
‘సన్నబియ్యం ఇస్తున్నారహో’
జ్యోతినగర్(రామగుండం) : ప్రజలకు ఏ దైనా సమాచా రం తెలియజేయాలంటే డ ప్పు చాటింపు వేసేవారు. ప్ర స్తుతం ఆధుని క సాంకేతిక ప రిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మొబైల్‌ఫోన్లు మరింత వేగంగా సమాచారం చేరవేస్తున్నాయి. అయి నా, నగరంలోని ఐదో డివిజన్ నర్రాశాలపల్లె లో గతకాలం నాటి పద్ధతిని గుర్తుచేసేలా శనివారం ‘రేషన్ దుకాణంలో సన్నబియ్యం పోస్తున్నారహో’ అని చిలుముల లింగయ్య డప్పు చాటింపు వేయడం ఆసక్తి కలిగించింది.
పాలిసెట్‌కు ఉచిత శిక్షణ
గోదావరిఖని: సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆ సంస్థ పాఠశాలల్లో టెన్త్ పాసైన విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్ శిక్షణ ఇవ్వనున్నట్లు సొసైటీ సెక్రటరీ శ్రీనివాస్, ఆర్జీ–2 డీజీఎం అనిల్‌కుమార్ తెలిపారు. ఆసక్తిగలవారి కోసం ఈనెల 10 నుంచి యైటింక్లయిన్ కాలనీ సెక్టార్–3 సింగరేణి ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులు ప్రారంభిస్తామన్నారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ధర్మారం(ధర్మపురి): అర్హులందరికీ సంక్షేమ ఫ లాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని విప్ లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంతోపాటు నర్సింగపూర్, పత్తిపాకలో శనివారం ఆయన సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి మాట్లాడారు. సంపన్నులతో సమానంగా పే దలు కూడా సన్నబియ్యంతో కూడిన భోజనం చేయాలనే ధ్యేయంతో ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. మండలంలో 16,308 రేషన్‌కార్డులు ఉండగా 47,788 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. వారందరికీ సన్నబియ్యం అందిస్తున్నట్లు వివరించారు. బీ ఆర్‌ఎస్ సర్కార్ పదేళ్లలో ఒక్కరేషన్‌కార్డు కూ డా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ప్ర కారంగా దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ ఈనెలాఖరులోగా రేషన్‌కార్డులు అందిస్తుందని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూ ప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం చైర్మన్ సంతోష్, మాజీ ఎంపీపీ కొడారి హన్మయ్య, తహసీల్దార్ వకీల్, ఆర్‌ఐ వరలక్ష్మి పాల్గొన్నారు.
పాలపొరకతో ఊరేగింపు
పాలపొరకతో ఊరేగింపు
పాలపొరకతో ఊరేగింపు


