ఆధునిక యంత్రాల వైపు రైతుల చూపు | - | Sakshi
Sakshi News home page

ఆధునిక యంత్రాల వైపు రైతుల చూపు

Published Thu, Apr 3 2025 1:03 AM | Last Updated on Thu, Apr 3 2025 1:03 AM

ఆధుని

ఆధునిక యంత్రాల వైపు రైతుల చూపు

జగిత్యాలఅగ్రికల్చర్‌: వ్యవసాయ రంగం రోజురోజుకూ శాస్త్ర, సాంకేతికతను సంతరించుకుంటూ ముందుకెళ్తోంది. ఒకప్పటి నాగళ్లు, కొడవళ్లు మూలకు పడ్డాయి. వాటి స్థానంలో ట్రాక్టర్లు, డ్రోన్లు వంటి ఆధునిక యంత్రాలు వచ్చాయి. ట్రాక్టర్లతోపాటు వాటికి ఉపయోగించే పరికరాల ధరలు ఆకాశానికి ఎగబాకాయి. దీంతో సామాన్య రైతులు కొనలేని పరిస్థితి ఏర్పడింది.

ఆధునిక యంత్రాలపై ఆధారం

మనిషి శ్రమ లేకుండా.. తేలికగా యంత్రాలతో వ్యవసాయ పనులు చేయాలని రైతులు ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా ఆధునాతన యంత్రాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. ఒకప్పుడు గ్రామానికి రెండుమూడు ట్రాక్టర్లు ఉంటే గొప్ప. అలాంటిది ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు వచ్చాయి. రైతులకు బ్యాంకులు ఈఎంఐ పద్ధతిలో రుణ సహాయం చేస్తుండటంతో ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నా వాటికి బిగించే పరికరాలకు మాత్రం రుణ సహాయం అందించడం లేదు. ఫలితంగా చిన్న, సన్నకారు రైతులు యంత్ర పరికరాల కోసం ప్రభుత్వ సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్నారు. వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, సీడ్‌ ప్లాంటేషన్‌, రోటోవేటర్‌, గడ్డిని కట్టలుకట్టే మిషన్లు, కేజీవీల్స్‌ వంటి పరికరాలను సబ్సిడిపై అందించాలని రైతులు కోరుతున్నారు.

స్మామ్‌ పథకం రైతులకు వరం

ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కింద వ్యవసాయ యాంత్రీకరణ పథకం(స్మామ్‌) ద్వారా ఉమ్మడి జిల్లాకు రూ 2.61కోట్లు కేటాయించింది. వీటి ద్వారా సన్న, చిన్న కారు రైతులతోపాటు మహిళా రైతులకు బ్యాటరీ స్ప్రేయర్స్‌, పవర్‌ స్ప్రేయర్స్‌, రసాయన మందులు పిచికారీ చేసే డ్రోన్‌లు, రోటోవేటర్లు, ఎరువులు, విత్తనాలు ఒకేసారి వేసే సీడ్‌ కమ్‌ ఫర్టిలైజర్‌ డ్రిల్‌, కల్టివేటర్లు, బండ్‌ ఫార్మర్‌ (పొలం మధ్య గట్లను పోసే యంత్రం), పవర్‌ వీడర్‌, బ్రష్‌ కట్టర్‌, పవర్‌ టిల్లర్లు, స్ట్రాబాలర్స్‌ను అందించాలని నిర్ణయించారు. సన్న, చిన్నకారు రైతులకు 40శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇందుకోసం మండల వ్యవసాయాధికారి కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తులను మండల పరిధిలోని తహసీల్దార్‌, ఎంపీడీఓ, వ్యవసాయాధికారి పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

రాయితీపై ఇచ్చే పరికరాలు

రాయితీపై ఇచ్చే పరికరాలు తక్కువగా ఉండటం, దరఖాస్తులు ఎక్కువగా వ స్తుండటంతో అధికారులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. బ్యాటరీ స్ప్రేయర్స్‌ కరీంనగర్‌కు 94, జగిత్యాలకు 101, రాజన్న సిరిసిల్లకు 64, పెద్దపల్లికి 75, పవర్‌ స్ప్రేయర్స్‌ కరీంనగర్‌కు 94, జగిత్యాలకు 102, రాజన్న సిరిసిల్లకు 64, పెద్దపల్లికి 76, రోటోవేటర్లు కరీంనగర్‌కు 55, జగిత్యాలకు 51, రాజన్న సిరిసిల్లకు 24, పెద్దపల్లికి 35, కల్టివేటర్లు కరీంనగర్‌కు 63, జగిత్యాలకు 67, రాజన్న సిరిసిల్లకు 29, పెద్దపల్లికి 34 మంజూరయ్యాయి. ప్రతి జిల్లాకు ఒక్కటి చొప్పున డ్రోన్‌, మూడు చొప్పున ట్రాక్టర్లు మంజూరయ్యాయి. ఇంకా సీడ్‌ కమ్‌ ఫర్టిలైజర్‌ డ్రిల్‌ కరీంనగర్‌కు 9, జగిత్యాలకు 12, సిరిసిల్లకు 4, పెద్దపల్లికి 6 మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లాకు బండ్‌ ఫార్మర్‌ 10, పవర్‌ వీడర్‌ 7, బ్రష్‌ కట్టర్‌ 17, పవర్‌ టిల్లర్‌ 10, స్ట్రాబాలర్స్‌ 9 మంజూరు కాగా ఆయా జిల్లాలకు 2,3 చొప్పున ఇవ్వనున్నారు.

పరికరాలకు అందని సబ్సిడీ

రాయితీ ఉంటే మరింత మందికి చేరువ

ఇటీవల కేంద్రం నుంచి ఉమ్మడి జిల్లాకు రూ.2.61 కోట్లు

50 శాతం సబ్సిడీ ఇచ్చే పరికరాలు

యంత్రం ధర

ట్రాక్టర్‌ రూ.4లక్షల నుంచి రూ.13లక్షలు

డ్రోన్‌ రూ.10లక్షలు

రోటోవేటర్‌ రూ.90వేల నుంచి రూ.1.90లక్షలు

ఎంబీ ఫ్లవ్‌ రూ.50వేల నుంచి రూ.1.40లక్షలు

కల్టీవేటర్‌ రూ.36వేల నుంచి రూ.50 వేలు

డిస్క్‌ కల్టీవేటర్‌ రూ.40వేల నుంచి రూ.50 వేలు

బండ్‌ ఫార్మర్‌ రూ.40వేల నుంచి రూ.3.50లక్షలు

రోటో ఫడ్లర్‌ రూ.26వేల నుంచి రూ.1.60లక్షలు

పవర్‌ టిల్లర్‌ రూ.2లక్షల నుంచి రూ.2.40లక్షలు

సీడ్‌కమ్‌ ఫర్టిలైజర్‌ డ్రిల్‌ రూ.46వేల నుంచి రూ.60లక్షలు

పవర్‌ స్ప్రేయర్‌ రూ.20వేలు

పవర్‌ వీడర్‌ రూ.60లక్షల నుంచి రూ.80లక్షలు

బ్రష్‌కట్టర్‌ రూ.40వేల నుంచి రూ.88వేలు

స్ట్రాబేలర్స్‌ రూ.4లక్షల నుంచి రూ.4.40 లక్షలు

మేజ్‌ షెల్లర్స్‌ రూ.66లక్షల నుంచి రూ.2.20లక్షలు

(ట్రాక్టర్లు, డ్రోన్‌లు పొందాలంటే తప్పనిసరిగా

2.5 ఎకరాల భూమి ఉండాలి)

ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం

కొన్నేళ్లుగా సబ్సిడీపై యంత్ర పరికరాలు సరఫరా చేయలేదు. ఇప్పుడు దరఖాస్తు చేసుకుందామంటే జిల్లాకు ఒక్కటి రెండు పరికరాలు మాత్రమే ఉన్నాయి. మండలానికి ఒక్క పరికరం కూడా వచ్చేలా లేదు. రైతులకు అవసరమైన పరికరాలకు సబ్సిడీ వర్తింజేయాలి.

– చీటేటి జీవన్‌రెడ్డి,

తొంబర్రావుపేట, మేడిపల్లి మండలం

దరఖాస్తులు స్వీకరిస్తున్నాం

యంత్ర పరికరాల స్కీం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రతి మండలానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. జిల్లా, మండల లెవల్‌ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యంత్రం ధరలో 50 శాతం సబ్సిడీ లభిస్తుంది.

– భాస్కర్‌, జిల్లా వ్యవసాయాధికారి, జగిత్యాల

ఆధునిక యంత్రాల వైపు రైతుల చూపు1
1/3

ఆధునిక యంత్రాల వైపు రైతుల చూపు

ఆధునిక యంత్రాల వైపు రైతుల చూపు2
2/3

ఆధునిక యంత్రాల వైపు రైతుల చూపు

ఆధునిక యంత్రాల వైపు రైతుల చూపు3
3/3

ఆధునిక యంత్రాల వైపు రైతుల చూపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement