ఆకట్టుకున్న కవి సమ్మేళనం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ట్రినిటి డిగ్రీ కాలేజీలో మంగళవారం ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. ఉదయ సాహితీ, జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సమ్మేళనం నిర్వహించారు. ఉదయ సాహితీ రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం లక్ష్మయ్య మాట్లాడారు. మానవ విలువలను ప్రతిబింబింప జేసే సాహితీవేత్తలు జిల్లాలో అనేక మంది ఉన్నారన్నారు. మనిషి నడవడి, సంస్కృతి, సంప్రదాయాల ను వివరించే ఆలోచన, అభ్యుదయ విలువలను పంచే సత్తా సాహిత్యానికే ఉందని అన్నారు. జిల్లా లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన కవులు, రచయితలు కవితాగానంతో అలరింపజేశారు. జిల్లా రచయితల సంఘం కన్వీనర్ ఏలేశ్వరం వెంకటేశం, కో కన్వీనర్ బుర్ర తిరుపతితోపాటు అనాసి జ్యోతి, బొమ్మిదేని రాజేశ్వరి, కొమురయ్య, కుమారస్వామి, రాజేశం, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


