
ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం
● ప్రభుత్వం రైతులకు వెంటనే పంట నష్టం పరిహారం చెల్లించాలి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి
జూలపల్లి(పెద్దపల్లి): అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం పరిహా రం చెల్లించకుంటే రైతులతో కలిసి పెద్దపల్లి ఎ మ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి హెచ్చరించారు. మండ ల కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే కంటితుడుపుగా పరామర్శించి వెళ్లిపోయారని, పరిహరంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదన్నారు. ఎకరాకు రూ.50వేల ప రిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. నాయకులు ప్రదీప్‌కుమార్, జ్యోతిబసు, పెద్దోల్ల ఐలయ్య, తీగెల లశోక్‌గౌడ్, దోడ్ల రాజిరెడ్డి, వెల్పుల ఓదెలు, గుమ్మడి శ్రీనివాస్ పాల్గొన్నారు.
బీజేపీని విస్తరించాలి
సుల్తానాబాద్: బీజేపీ అన్ని రంగాల్లో విస్తరించినప్పుడే ముందు వరుసలో ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ గ్రంథాలయం కార్యదర్శిగా గుడ్ల వెంకటేశ్ ఎన్నిక సందర్భంగా స్థాని క పార్టీ కార్యాలయంలో ఆయనను సన్మానించా రు. ఈసందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడారు. నా యకులు కడారి అశోక్‌రావు, సౌదరి మహేందర్‌యాదవ్, కూకట్ల నాగరాజు, నాగులమల్యాల తిరుపతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.