
ఉపరితల గనులే కీలకం
● 10 ఓసీపీల్లో వందశాతం బొగ్గు ఉత్పత్తి ● నిర్దేశిత లక్ష్యం సాధించిన ఐదు భూగర్భ గనులు
గోదావరిఖని: సింగరేణి సంస్థ వార్షిక బొగ్గు ఉ త్పత్తి లక్ష్య సాధనలో ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ)లు ఈ సారి కూడా కీలకపాత్ర పోషించాయి. సంస్థలోని పది ఓసీపీలు వందశాతం ఉత్పత్తి నమోదు చేయగా.. మరికొన్ని లక్ష్యానికి చేరువ లో నిలిచాయి. నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో ఓసీపీలు సింహ భాగంలో నిలవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నాయి.
భూగర్భ గనుల్లోనూ వందశాతం..
ఈసారి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో ఐదు భూగర్భగనులు కూడా వందశాతం బొగ్గు ఉత్పత్తి సాధించి కార్మికులు, సంస్థలో ఆశలు రేకెత్తించాయి. ఓసీపీల ద్వారా 65.90 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తీయాలని లక్ష్యంగా నిర్ణయించగా, 64.19 మిలియన్ టన్నులు సాధించాయి. భూగర్భగనుల ద్వారా 6.10 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా 4.80 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాయి. వందశాతం ఉత్పత్తి లక్ష్య సాధనలో ఓసీపీలు అగ్రభాగాన నిలవగా, భూగర్భగనులు వెనుకపడ్డాయి. వార్షిక నిర్దేశిత లక్ష్యం 72 మిలియన్ టన్నులు కాగా అందులో 64మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఓసీపీల ద్వారానే సాధించడం గమనార్హం.
వందశాతం లక్ష్యం సాధించిన ఓసీపీలు
సంస్థ వ్యాప్తంగా 11 ఓసీపీలు వార్షిక లక్ష్యం సాధించాయి. ఇందులో జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీ, ఖైరిగూడ ఓసీ, కోయగూడెం ఓసీ–2, జేకే–5ఓసీ, పీకే ఓసీ–4, మణుగూరు ఓసీ, ఓసీపీ–3, జీడీకే–5 ఓసీపీ, ఓసీపీ–1, ఓసీపీ–2 గనులు ఉన్నాయి.
భూగర్భగనులు ఇవే..
వందశాతం బొగ్గు ఉత్పత్తి క్ష్యం సాధించిన భూగర్భగనులు ఐదు ఉన్నాయి. వాటిలో జీడీకే–11, ఆర్కే–6, ఆర్కే న్యూటెక్, ఎస్‌ఆర్‌పీ–1గని, ఎస్‌ఆర్‌పీ–3, 3ఏగనులు ఉన్నాయి. భూగర్భగనులు లక్ష్య సాధనలో అగ్రభాగాన నిలవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
బొగ్గు ఉత్పత్తి (మిలియన్ టన్నులో్ల)
గని లక్ష్యం సాధించింది
ఓసీపీలు 65.90 64.19
భూగర్భగనులు 6.10 4.81
మొత్తం 72.00 69.00