● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ | - | Sakshi
Sakshi News home page

● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌

Published Wed, Apr 9 2025 12:14 AM | Last Updated on Wed, Apr 9 2025 12:14 AM

● రామ

● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌

బీసీల అభివృద్ధికి సీఎం కృషి

గోదావరిఖని: బీసీల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన వైఖరితో చారిత్రక నిర్ణయం తీసుకున్నా రని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎదిగేందుకు వేర్వేరు బిల్లులు ప్రవేశ పెట్టారని తెలిపారు. బీసీ నినాదంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపే తం చేయాలని కోరారు. నాయకులు బొంతల రాజేశ్‌, మహంకాళి స్వామి, దీటి బాలరాజు, తిప్పారపు శ్రీనివాస్‌, పెద్దెల్లి ప్రకాశ్‌, మారెల్లి రాజిరెడ్డి, ముస్తాఫా, గట్టు రమేశ్‌, యుగేందర్‌, గుండేటి రాజేశ్‌ పెద్దెల్లి తేజస్విని తదితరులు పాల్గొన్నారు. కాగా, రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ను క్యాంపు కార్యాలయంలో టీజీ జెన్‌కో ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు సీనియర్‌ ఇంజినీర్లు, సిబ్బంది, యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

సొంతగూటికి తానిపర్తి గోపాల్‌రావు

రామగుండం మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ తానిపర్తి గోపాల్‌రావు కాంగ్రెస్‌ గూటికి చేరారు. గత ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ చేరిన ఆయన.. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సొంతగూటికి చేరడంతో ఎమ్మెల్యే మక్కాన్‌సిగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.

వైకుంఠ రథం ఏర్పాటు చేయాలి

రామగుండం: అంతర్గాం మండల ప్రజల కోసం వైకుంఠరథం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఎండీ గౌస్‌బాబా కోరారు. ఈమేరకు ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.

తాగునీటికి తిప్పలు రానీయొద్దు

ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లిరూరల్‌: వేసవిలో ప్రజలకు తాగునీటి తిప్ప లు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎ మ్మెల్యే విజయరమణారావు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పంచాయతీరాజ్‌, మిషన్‌భగీరథ అ ధికారులతో తాగునీటి సరఫరా సమీక్షించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున తాగునీటి సమ స్య రానీయొద్దన్నారు. లీకేజీలు, ఇతర సమస్యలు గుర్తించి పరిష్కారం చూపాలని అన్నారు. సీసీ రో డ్లు, డ్రైనేజీలు తదితర పనుల్లో వేగం పెంచాలన్నా రు. త్వరితగతిన పనులు పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని ఆయన కోరారు.

పేదల కళ్లలో ఆనందం కోసమే..

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): పేదల కళ్లలో ఆనందం కోసమే సన్నబియ్యం పంపిణీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించినట్లు ఎమ్మెల్యే విజయరమణారా వు తెలిపారు. నీరుకుల్లలో సన్నబియ్యం పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. తహసీల్దార్‌ రాంచందర్‌, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, నాయకు లు ప్రకాశ్‌రావు, శ్రీగిరి శ్రీనివాస్‌, చిలుక సతీశ్‌, సా యిరి మహేందర్‌, విజేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ 1
1/1

● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement