పదకొండైనా దవాఖానా తెరవలే
ఇది సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలోని పల్లెదవాఖానా. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు డాక్టరును సంప్రదించేందుకు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు దవాఖానా వద్దకు వచ్చాడు. అప్పటికింకా ఆస్పత్రి తలుపులు తెరవలేదు. దాదాపు పదకొండు గంటలు దాటినా వైద్యసిబ్బంది, వైద్యులెవరూ అటువైపు రాలేదు. ఈ దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కడంతో వాట్సాప్ ద్వారా వైద్యాధికారి దృష్టికి వెళ్లింది. దీంతో పది నిమిషాల్లోనే సిబ్బంది ఆస్పత్రికి చేరుకున్నారని గ్రామస్తులు తెలిపారు. పల్లె, పట్టణ దవాఖానాలు, పీహెచ్‌సీలను కలెక్టర్‌తోపాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నా సిబ్బంది తీరు మారకపోవడం శోచనీయం.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


