
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..
● అర్ధరాత్రి జరిగితే బూడిద కింద సజీవ సమాధి అయ్యేవారు
● కాలనీలను ముంచెత్తిన బూడిదనీరు
● ఆందోళనలో కాలనీవాసులు
రామగుండం: పట్టణంలోని అక్బర్‌నగర్ కాలనీ పక్కనున్న ఎన్టీపీసీ బూడిద పైపులైన్ బుధవారం రాత్రి ఒక్కసారిగా పగిలిపోవడంతో స్థానికులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. విద్యుత్ కేంద్రం నుంచి యాష్‌పాండ్ వరకు నిర్మించిన బూడిద పైపులైన్ పగిలిపోవడంతో నీటితోకూడిన వేడిబూడిద పైకి ఎగజిమ్మిది. సమీపంలోని ఇళ్లను ముంచెత్తింది. అప్పుడే ఎండతగ్గడంతో ఆరుబయట కూర్చొని చల్లటిగాలికి సేద తీరుతున్న కాలనీవాసులు.. ఒక్కసారిగా బూడిదపైపులైన్ పగిలి భారీశబ్దం రావడంతో భయాందోళనకు గురయ్యారు. కొన్నిక్షణాలు అసలు ఏం జరిగిందో తెలియక దిక్కులు చూస్తూ ఉండిపోయారు. ఈక్రమంలోనే బూడిదనీరు ఇళ్లలోకి చేరింది. కనీసం ప్రాణాలైన దక్కించుకుందామని కాలనీవాసులు దూరంగా పరుగులు పెట్టారు. బూడిద పైపులైన్ పగిలిందని గుర్తించి అదే కాలనీలో నివాసముండే కొండల రాజేందర్ వెంటనే ఎన్టీపీసీ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన అధికారులు వెంటనే బూడిద సరఫరాను నిలిపివేశారు. అధికారులకు సమాచారం ఇవ్వడంలో జాప్యం జరిగినా, అర్ధరాత్రి పైపులైన్ పగిలినా పదుల సంఖ్యలో ప్రజలు బూడిదకింద సజీవ సమాధి అయ్యేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బూడిద నీరు కారింది
మా ఇంటికి కొద్ధిదూరంలోని పైపు పగిలి బూడిదనీరు పైకిఎగజిమ్మింది. మా ఇంటిపై వేడి బూడిదపడింది. ఆ వేడిబూడిద ఒత్తిడితో రేకులు పగిలిపోయాయి. బూడిద ఇంట్లోకి చేరింది. మూడు గదుల్లో బూడిద చేరింది. కిచెన్‌లోని నిత్యావసరాలు పనికిరాకుండా పోయాయి. బెడ్స్, తలుపులు, గోడలు తడిసి ముద్దయ్యాయి.
– సజ్జు, స్థానికుడు
శాశ్వత పరిష్కారం చూపించాలి
ఎన్టీపీసీ బూడిదనీరు తరలించే పైపు పగిలిన ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాలను శాశ్వత ప్రాతిపదికన ఆదుకోవాలి. ఇళ్లలో నిండిన బూడిదను వెంటనే తొలగించాలి. బూడిదతో శిథిలావస్థకు చేరిన నివాసాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ఇందుకోసం ఎన్టీపీసీ వెంటనే ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగాలి. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఉపేక్షించేదిలేదు.
– మక్కాన్‌సింగ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం
పైసాపైసా జమచేసి ఇల్లు కట్టుకున్న
నా భర్త మీరా హోటల్ నడు పుకుంటూ కుటుంబాన్ని పో షించేవాడు. ప్రమాదవాశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మా బతుకులు రోడ్డున పడ్డాయి. పై సాపైసా కూడబెట్టి రెండు గదులతో ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు బూడిద పైపు పగిలి ఇల్లంతా బూడిదతో నిండిపోయింది. కూలీపని చేసుకుంటేనే దినం గడిచే పరిస్థితి. ఇప్పుడు నా బతుకు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఎన్టీపీసీ ఆదుకోవాలి. – ఖైరున్నీసా, స్థానికురాలు
ఇంట్లోకి చేరింది
మా ఇంటి వెనుకాల ఉన్న పైపు పగిలి వేడి బూడిద ఇంట్లోకి వచ్చిచేరింది. క్షణా ల్లో మోకాలి లోతుకు బూడి ద పేరుకుపోయింది. సా మాను పూర్తిగాబూడిదమయమైంది. అర్ధరాత్రి ఈ ఘటన జరిగితే ప్రాణాలపై ఆశలు ఉండేవికాదు. ఎన్టీపీసీ అధికారులు స్పందించి మా ఇళ్లకు రక్షణ కల్పించాలి. – ఖదీరా, స్థానికురాలు

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..