Story Of Gloria Okon, Nigeria Most Controversial Female Drug Smuggler In Telugu - Sakshi
Sakshi News home page

Drug Smuggler Gloria Okon Story: మహిళా డ్రగ్స్‌ స్మగ్లర్‌ మృతి వెనుక అంతుచిక్కని మిస్టరీ..

Published Tue, Jun 13 2023 8:26 AM | Last Updated on Tue, Jun 13 2023 11:53 AM

Story Of Gloria Okon Nigerias Most Controversial Female Drug Smuggler - Sakshi

అది 1985, ఏప్రిల్‌ 22, నేషనల్‌ సెక్యూరిటీ ఆర్గనైజేషన్‌(ఎన్‌ఎస్‌ఓ) 35 ఏళ్ల మహిళ గ్లోరియా ఒకాన్‌ను హెరాయిన్‌తో పాటు ఇతర హార్డ్ డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నందుకు నైజీరియాలోని అమీను కానో అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసింది.  ఆ సమయంలో ఆమె నుంచి 56.70 గ్రాముల మత్తు పదార్ధాలు, 301 డాలర్లు, 60 పౌండ్ల స్టెర్లింగ్, 20,000యెన్లు,19,000 ఇటాలియన్ లిరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆ సమయంలో ఆమె నైజీరియా నుండి ఇంగ్లండ్‌కు వెళుతోంది. గ్లోరియా ఒకాన్‌  చేస్తున్న మత్తుమందుల రవాణాకు సంబంధించిన వార్తలు స్థానిక, అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారాయి. నైజీరియన్లు ఆమె గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి చూపారు. ఎందుకంటే నాటి బుహారీ మిలిటరీ.. నిషేధిత డ్రగ్స్‌తో ఎవరైనా పట్టుబడితో మరణశిక్ష విధిస్తామని ప్రకటించింది. గ్లోరియా ఒకాన్‌ను అరెస్టు చేసిన ఆరు రోజుల తర్వాత అంటే 1985, ఏప్రిల్ 28న కస్టడీలో ఉన్న ఆమె వివాదాస్పద రీతిలో మరణించింది. ఆమె మృతికి ఫుడ్ పాయిజనింగ్ కారణమని మెడికల్‌ రిపోర్టు వెల్లడించింది. అరెస్టు చేసిన సమయంలో ఆమెలో అనారోగ్య సంకేతాలు లేవని దానిలో పేర్కొన్నారు. 

తొలగని అనుమానాలు..
గ్లోరియా ఒకాన్‌ను కస్టడీలో ఉంచిన కస్టమ్స్ అధికారి మాట్లాడుతూ ఆమెను అరెస్టు చేసిన రోజున, ఆమె రైస్‌, బీన్స్ అడిగిందని, ఆ తరువాత ఆమె అనారోగ్యానికి గురయ్యానని తెలిపిందన్నారు. ఆ  తరువాత ఆమె మరణించిందని అన్నారు. అయితే ఆమె మరణానికి ముందు ఆమెను పోలీసులు విచారించారు. కానీ ఆమె మాట్లాడేందుకు నిరాకరించింది. అయితే ఆమె ఒక క్లూని మాత్రంవదిలి వెళ్లింది.

బస్సీ అనే పేరును విచారణలో ఆమె ప్రస్తావించింది. కాగా గ్లోరియా ఒకాన్‌ బంధువులెవరూ ఆమె మృతదేహాన్ని క్లెయిమ్ చేయడానికి రాలేదు. అది మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. నాటి పాలకుడు బాబాంగిడా బుహారీని అధికారం నుండి తొలగించిన తర్వాత, గ్లోరియా ఒకాన్‌ కేసు దర్యాప్తును తిరిగితోడేందుకు నైజీరియన్ న్యాయవాది గని ఫవేహిన్మి సిద్ధమయ్యారు. అయితే గ్లోరియా ఒకాన్‌ కేసులో ఎటువంటి ముగింపు లేకపోవడంతో నైజీరియన్లలో అనేక ఊహాగానాలు చెలరేగాయి. 

సాధారణ జీవితం గడుపుతూ..
గ్లోరియా ఒకాన్‌ నాటి నైజీరియన్‌ ఆర్మీ జనరల్‌ బాబాంగిడా కోసం పనిచేస్తున్నదని కొందరు భావించారు. అందుకే ఆమెను హత్య చేశారని అనుకున్నారు. గ్లోరియా ఒకాన్‌ మరణం అసహజమైనదని, ఆమె కుటుంబసభ్యులకు పంపిన మృతదేహం ఆమెది కాదని కొందరు వాదించారు. నైజీరియాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఆమె సాధారణ జీవితాన్ని గడిపేదని కూడా అంటారు. జూన్ 2009లో నైజీరియన్‌ ప్రొఫెసర్ తైమివో ఒగునాడే ది నేషన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “గ్లోరియా ఒకాన్‌ అసలు పేరు చిన్యెరే. ఆమె ఛార్లెస్ "జెఫ్" చాండ్లర్‌ను వివాహం చేసుకుంది. అతను న్జియోగ్వు హత్య జరిగిన మర్నాడు హతమయ్యాడు. కాగా చిన్యేరే, మరియమ్, ప్రిన్సెస్ అట్టా మొదలైనవారంతా స్నేహితులు. వారందరూ మిలిటరీలోని వారిని వివాహం చేసుకున్నారు. నాటి రోజుల్లో మిలటరీలో పనిచేసేవారిని ఎంతో గౌరవించేవారు. 

కేసు రీఓపెన్ అవుతుందా?
ఇమో స్టేట్‌కు చెందిన టివ్... చిన్యెరేను వివాహం చేసుకున్నాడు. భర్త మరణంతో  చిన్యెరే వితంతువుగా మారింది. అనంతరం ఆమె యూకే- నైజీరియా మధ్య డ్రగ్స్‌ వ్యాపారాన్ని ఆశ్రయించింది. ఆపై ఆమె డ్రగ్స్‌తో పట్టుబడింది. కానో నుండి లండన్‌కు వెళ్లే విమానంలో చిన్యేరేను ఎక్కించిన  మమ్మన్ వత్సా  ఆమె చనిపోయిందని పేర్కొన్నారు. ఈ నాటి వరకు గ్లోరియా ఒకాన్‌ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగానే మిగిలింది. మూసివేసిన ఈ కేసును తిరిగి తెరవడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కేసు రీఓపెన్ అవుతుందా? లేదా అనేది వేచిచూడాల్సిందే. 

ఇది కూడా చదవండి: పళ్లను చూసి పెళ్లాడేస్తారు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement