జిల్లాలో... పులి చర్మం స్మగ్లర్లు
Published Tue, Dec 17 2013 3:15 AM | Last Updated on Tue, Nov 6 2018 5:21 PM
అట్టాడ (జామి)న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో స్మగ్లరు అటవీశాఖ అధికారులపై దాడి చేసి ఇద్దరిని దారుణంగా చంపేసిన వార్త నుంచి ఇంకా తేరు కోకముందే పులులను వేటాడే స్మగర్లను జిల్లాలో అరెస్ట్ చేశారన్న వార్త సంచలనం రేపింది. ఈ ముఠా సభ్యులు 15 రోజులుగా జామి మండలంలో మకాం వేశారు. రెండేళ్లుగా వారి కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు మండలంలోని అట్టాడ పంచాయతీ కోరుకొండ రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం తెల్లవారు జామున పట్టుకున్నారు.
పంజాబ్ రాష్ట్రానికి చెందిన అన్నదమ్ములు సబ్బీర్‌భాటియా, జగదీష్‌భాటియా, రంజిత్ సింగ్‌భాటియా కొన్ని సంవత్సరాలుగా పులులను వేటాడుతూ వాటి చర్మాలను అంతర్జాతీయస్థాయిలో విక్రయిస్తున్నారు. ఈ ముగ్గురి కోసం పోలీసులు రెండేళ్లుగా తీవ్రంగా గాలిస్తున్నా రు. వీరు ఇప్పటివరకు సుమారు 150కిపైగా సెల్ సిమ్‌లను, తరచూ మకాంలు మారుస్తూ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నారు. అయితే వారు ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్ సిగ్నల్స్ ప్రాంతాన్ని మొబైల్‌ట్రాక్‌ద్వారా గుర్తించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కొత్తవ లస కోర్టుకు తరలించారు. న్యాయస్థానం అనుమతి మేరకు మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు పోలీసు లు తెలిపారు.
ఎనిమిది కుటుంబాలపై కేసులు
కోరుకొండ రైల్వేస్టేషన్ సమీపంలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సంచార జాతులు ఎనిమిది కుటుంబాల వారు గుడారాలు వేసుకుని 15 రోజులుగా ఉంటూ ప్లాస్టిక్ బొమ్మలు విక్రయి స్తూ జీవనం సాగిస్తున్నారు. నిందితులు కూడా వీరితో కలిసే ఉంటున్నారు. అనుమానాస్పదం గా ఉన్న ఈ ఎనిమిది కుటుంబాలకు చెందిన 15 మందిని జామి ఎస్‌ఐ బి.లూథర్‌బాబు పోలీస్‌స్టేషన్‌కు తరలించి, తహశీల్దార్ ఆదేశాల తో వీరిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.
Advertisement
Advertisement