అంతర్జాతీయ ఎర్ర చందన స్మగ్లర్ ముంబైకి చెందిన రాజూభాయ్‌ని చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు పట్టుకున్నారు. విదేశాలకు వెయ్యి టన్నుల ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసినట్లు రాజూభాయ్‌పై ఆరోపణలున్నాయి. అక్రమ సంపాదన ద్వారా అతడు దేశ వ్యాప్తంగా రూ.600 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వారం రోజుల పాటు ముంబైలో ఉచ్చుపన్నిన ఏపీ పోలీసులు చాకచక్యంగా రాజూభాయ్ ని అరెస్టు చేసినట్లు వివరించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి పది కేసుల్లో జితేంద్రమోహన్ అలియాస్ రాజాభాయ్‌ను నిందితునిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.