
సాక్షి, రేణిగుంట: ఎర్రచందనం అక్రమ రవాణ చేస్తున్న ముఠాను ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం అంజనేయపురం చెక్ పోస్టు వద్ద ఫారెస్టు సిబ్బంది తనీఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అటువైపుగా వచ్చిన తమిళనాడుకి చెందిన TN 21BC 1806 కారును సిబ్బంది చెక్ చేశారు. ఆ కారులో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది.
కారులో ఉన్న 25 ఎర్ర చందనం దుంగలను ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనీఖీల్లో భాగంగా వారు కారు ఆపకుండా వెళ్లే ప్రయత్నాం చేశారు. సిబ్బందిపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడికి యత్నించారు. ఆ సమయంలో స్థానికులు ఫారెస్టు సిబ్బందికి సహాకరించారు. దీంతో సిబ్బంది స్మగ్లర్లను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment