gang arrsted
-
హైదరాబాద్ భారీగా డ్రగ్స్ పట్టివేత
-
హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
-
నకిలీ సర్టిఫికెట్ల తయారీలో శిక్షణ!
సాక్షి, హైదరాబాద్: నకిలీ విద్యార్హత పత్రాల తయారీ ముఠా గుట్టురట్టయ్యింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లను సృష్టించి, విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఎస్ఓటీ డీసీపీ కే మురళీధర్, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌లతో కలిసి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్ట, క్యూబా కాలనీకి చెందిన మహ్మద్ ఖలీముద్దీన్ అలియాస్ ఖలీం నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడంలో దిట్ట. గత ఏడేళ్లుగా ఈ దందాను నిర్వహిస్తున్నాడు. ఇతనిపై చాంద్రాయణగుట్ట, అబిడ్స్ ఠాణాలలో రెండు కేసులున్నాయి. పోలీసుల నిఘా ఉండటంతో అజ్ఞాతంలో ఉంటూ తన అనుచరులకు శిక్షణ ఇస్తున్నాడు. ఖలీం స్నేహితుడైన గోల్కొండ మోతీ దర్వాజకు చెందిన ముక్తార్ అహ్మద్‌కు అడోబ్ ఫొటోషాప్‌లో ఫొటోలు, డాక్యుమెంట్ల ఎడిటింగ్‌పై మంచి అనుభవం ఉంది. దీంతో ఖలీం ఇతనికి నకిలీ సరి్టఫికెట్ల తయారీ శిక్షణ ఇచ్చాడు. అలాగే విద్యార్హత పత్రాల తయారీకి అవసరమైన యూనివర్సిటీ గుర్తింపు చిహ్నలు, హాలోగ్రామ్స్ ఇతరత్రా వస్తువులను అందించాడు. తన పేరు బయటకు రాకుండా రహస్యంగా ఉంచాలని, కమీషన్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించాడు. రాజేంద్రనగర్‌కు చెందిన అహ్మద్ ఫిరోజ్, లక్డీకపూల్ ఏసీ గార్డ్స్‌కు చెందిన మహ్మద్ ఫరూక్ అజీజ్, టోలిచౌకీ పారామౌంట్ కాలనీకి చెందిన మహ్మద్ సారూషుల్లా ఖాన్‌లను ముక్తార్ కమీషన్ ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వారికి అవసరమైనట్లు నకిలీ విద్యార్హత పత్రాలను తయారు చేసేవాడు. ఒక్కో సరి్టఫికెట్‌ను రూ. లక్ష, రూ. 2 లక్షలకు విక్రయించేవాడు. ఇందులో 25 శాతం కమీషన్‌ను ఖలీంకు చెల్లించేవారు. ఈ క్రమంలో నిందితుల నుంచి హుస్సేనీఆలంకు చెందిన మహ్మద్ జుబేర్ అలీ, టోలిచౌకీకి చెందిన సయ్యద్ అతీఫుద్దిన్ రూ.లక్షకు నకిలీ విద్యార్హత పత్రాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సర్టిఫికెట్లను తీసుకునేందుకు బాలాపూర్ ఎర్రకుంటకు వెళ్లారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేసి సరూషుల్లా ఖాన్, జుబేర్, అతీఫుద్దిన్, ఫరూఖ్ అజీజ్, మహ్మద్ ఫిరోజ్, ముక్తార్ అహ్మద్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి నకిలీ సర్టిఫికెట్లతో పాటు ల్యాప్‌టాప్, స్టాంప్‌లు, 6 సెల్ఫోన్లు ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ ముఠా 258 సర్టిఫికెట్లను తయారు చేసి, విక్రయించారని, వీరిలో పలువురు విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఎర్రగడ్డకు చెందిన సల్మాన్ యూకేకు, కాలాపత్తర్‌కు చెందిన మీర్జా యూసుఫుద్దిన్ న్యూయార్క్‌కు, మెహదీపట్నానికి చెందిన మహ్మద్ మాజీద్ అమెరికాకు, గోల్కొండకు చెందిన రెహాన్, అశ్వాక్ అహ్మద్ దుబాయ్ దేశాలకు వెళ్లినట్లు సీపీ తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి, ఫాస్ట్‌ట్రాక్ కోర్ట్‌లో శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు. వీరి వెనకెవరున్నారు? ఈ నకిలీ సరి్టఫికెట్ల రాకెట్‌ను నడుపుతున్న ప్రధాన నిందితుడు మహ్మద్ ఖలీముద్దిన్‌తో సహా ఇతర నిందితులు, కొనుగోలు చేసే విద్యార్థులు అందరూ ఒకే వర్గానికి చెందిన వారే కావటంతో పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వీరి నుంచి నకిలీ పత్రాలను కొనుగోలు చేసిన విద్యార్థులు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీరి వెనక ఎవరైనా అదృశ్య శక్తులు ఉండి ఈ రాకెట్‌ను నడిపిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు సూత్రధారి ఖలీం పట్టుబడితేనే దీని వెనక ఎవరున్నారనేది బయటపడుతుందని ఓ పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: నకిలీ పత్రాలతో ఇల్లు విక్రయం) -
గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు
మహబూబ్‌నగర్ క్రైం: విశాఖపట్నం నుంచి శ్రీలంకకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఒక ముఠాను మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 4న భూత్పూర్ మండలం తాటికొండ దగ్గర జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీ ని హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. సంఘటన స్థలం పరిశీలించిన పోలీసులకు కారులో గంజాయి దొరికింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు ఈ ముఠాను అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రెమా రాజేశ్వరి గురువారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. తమిళనాడులోని మధురైకి చెందిన సతీశ్, కల్యాణ్ గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు. ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందిన శివనేశ్వరన్, అజిత్, సురేందరన్‌లతో కలసి విశాఖపట్నం జిల్లాలో రాము, మూర్తి, రాంరెడ్డి అనే వ్యక్తుల వద్ద కేజీ రూ.6 వేలకు గంజాయి కొనుగోలు చేసి.. ఆ తర్వాత ఆ గంజాయిని హైదరాబాద్‌లో రూ.11వేలు, చెన్నైలో రూ.12 వేలకు విక్రయించేవారు. రామేశ్వరం మీదగా శ్రీలంకకు సముద్రమార్గం ద్వారా ఎగుమతి చేసేవారు. ఈ క్రమంలోనే వీరు గురువారం హైదరాబాద్ సమీపంలో సతీశ్, కల్యాణ్, సురేందరన్ ఉన్నారని పోలీ సులు సమాచారం తెలుసుకొని అరెస్టు చేశారు. వీరిలో సతీశ్, కల్యాణ్, సురేందరన్, అజిత్‌లను రిమాండ్‌కు తరలించారు. శివనేశ్వరన్, రాము, మూర్తి, రాంరెడ్డిలు పరారీలో ఉన్నారు. అరెస్టయినవారి నుంచి రూ.21లక్షల విలువ చేసే 180 కేజీల గంజాయి, రెండు ఇన్నోవా కార్లు సీజ్ చేశారు. గతంలో వీరు రెండు సార్లు గంజాయి కొనుగోలు చేసి రామేశ్వరంకు చెందిన జయచంద్రన్ అనే వ్యక్తి ద్వారా శ్రీలంకకు పంపించి విక్రయించారు. -
సూరత్‌లో రూ. 5.44 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం
సూరత్ : రూ. 5.44 లక్షల నకిలీ నోట్లను రాజస్తాన్ నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పూణే పోలీసులు శనివారం సూరత్‌లో అరెస్టు చేశారు. కాగా నిందితులిద్దరూ రాజస్థాన్ నుంచి బస్సులో ప్రయాణిస్తుండగా నియోల్ చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డారు. కాగా పట్టుబడిన వారిని చునిలాల్ సుతార్, చంద్రకాంత్ షాగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల వద్ద మొత్తం 642 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. వీటిలో రూ. 2000,రూ. 500,రూ. 200,రూ.100 నోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆలయాలే వీరి టార్గెట్..
కరీంనగర్‌క్రైం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలయాలే ప్రధాన లక్ష్యంగా ఏళ్లకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఓ వెండి విగ్రహం, రూ.5 లక్షల విలువైన బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎనిమిది మంది ముఠా.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ పరిధిలోని తుర్కాశీనగర్‌కు చెందిన షేక్‌వలీ, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి పరిధిలోని ఇస్లాంనగర్‌కు చెందిన సయ్యద్ బాషా, సయ్యద్‌మదర్, అదే మండలం షాజుల్‌నగర్‌కు చెందిన షేక్‌బాబా, సిద్దిపేట జిల్లా పెద్దూర్ మండలం తుర్కాశీగ్రామానికి చెందిన సయ్యద్‌పాషాతో మరో ముగ్గురు మైనర్లను కలుపుకుని ముఠాగా ఏర్పడ్డారు. ఆలయాలే టార్గెట్.. పొద్దంతా బండకొట్టే పని చేసే వీరు రాత్రి సమయంలో ఆలయాల్లో దొంగతనాలు చేయడం వృత్తిగా ఎంచుకున్నారు. రాత్రిపూట ఆటోలో సంచరిస్తూ.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం శివారులోని హనుమాన్ ఆలయంలో దొంగతనం చేశారు. చొప్పదండి మండలం వెదురుగట్టులోని మల్లికార్జున ఆలయం, పోచమ్మఆలయం, గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో పొచమ్మ గుడి, హిమ్మత్‌నగర్‌లోని ఎల్లమ్మ గుడి, కేశవపట్నం మండలం లింగాపూర్ గ్రామంలో ఎల్లమ్మగుడి, జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామంలోని మహాలక్ష్మి ఆలయం, కథలాపూర్ మండలంలోని కలికోట గ్రామంలో ఎల్లమ్మగుడి, సత్యనారాయణ ఆలయం, బుగ్గారం మండలంలోని మద్దునూర్ గ్రామంలోని పెద్ద పోచమ్మ ఆలయం, బీర్పూర్ మండలంలోని సీతారామచంద్ర ఆలయం, పెద్దపల్లి జిల్లాలోని పొత్కపల్లి మండలం కనగర్తి గ్రామంలోని ప ంచముఖ హనుమాన్ ఆలయం, జూలపల్లి మ ండలం నారాయణపల్లి గ్రామంలోని మహలక్ష్మి ఆలయం, రాజన్నసిరిసిల్ల జిల్లా పెద్దూర్ గ్రామం లోని ఒక ఇంట్లో చోరీ చేశారు. ఇలా చిక్కారు... కరీంనగర్జిల్లాలో పలు ఆలయాల్లో చోరీలు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో దొంగలను పట్టుకునేందుకు కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి పర్యవేక్షణలో చొప్పదండి సీఐ రమేశ్, గంగాధర ఎస్సై పుల్లయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏ ర్పాటు చేశారు. వీరికి సైబర్‌ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్చార్జి మురళి బృందం సహకారం అందించారు. చోరీచేసిన ఆభరణాలను అమ్మేందుకు బుధవారం చొప్పదండికి వస్తున్నారన్న సమాచారంతో స్థానికంగా ఆరుగురిని పట్టుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు కావడంతో జువైనల్ విచారణకు పంపించారు. మరో ముగ్గరిని అరెస్టు చేశారు. వారి నుంచి వెండి విగ్రహం, రూ.5లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 70వేల నగదు, ఆటో, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి గ్రామం ఇస్లాంనగర్‌కు చెందిన సయ్యద్ మదర్, పెద్దూర్ మండలం తుర్కశి గ్రామానికి చెందిన సయ్యద్‌భాషా పరారీలో ఉన్నారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న చొప్పదండి సీఐ రమేశ్, గంగాధర ఎస్సై పుల్లయ్య, సైబర్‌ఫోరన్సిక్ ఇన్చార్జి మురళి, చొప్పదండి హెడ్‌కానిస్టేబుల్ రాజమౌళి, కానిస్టేబుళ్లు కోటేశ్వర్, శ్రీనివాస్, శ్రీకాంత్‌కు సీపీ రివార్డులు అందించారు. పోలీసుల అదుపులో ఇద్దరు దొంగలు..? జగిత్యాలక్రైం: ధరూర్‌క్యాంప్‌లోని కోదండ రామాలయం, జగిత్యాల మండలం అంబారిపేట శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను టాస్క్‌ఫోర్స్ సీఐ సర్వర్ బృం దం పట్టుకున్నట్లు సమాచారం. అంబారిపేట గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో 15రోజుల క్రితం స్వామివారి ఆభరణాలు, నగదు చోరీకి గురైంది. కోదండ రామాలయంలోనూ 4 తులాల బంగారం, రూ.5 వేల నగదు చోరీకి రైం ది. జిల్లా ఎస్పీ సునీల్‌దత్ ఆలయాన్ని స్వయంగా పరిశీలించి రెండు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీపుటేజీల ఆధారంగా దొంగలను గుర్తించారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాగర్‌ను టాస్ ్కఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. రమేశ్‌ను టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. -
సుపారీగ్యాంగ్ సభ్యుల అరెస్టు
కోరుట్ల: భూవివాదంలో ఒకరి హత్యకు పాల్పడ్డ సుపారీగ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ఇద్దరి సభ్యులను గురువారం అరెస్టు చేశామని, ముఠాలీడర్ అజీజ్ కోసం గాలింపు చేపట్టినట్లు కోరుట్ల సీఐ సతీశ్‌చందర్‌రావు తెలిపారు. కోరుట్ల మండలం గుమ్లాపూర్‌లో ఏడాది క్రితం రాజ్‌మహ్మద్‌కు అతని సోదరులతో భూవివాదం నెలకొంది. ఈక్రమంలో రాజ్‌మహ్మద్ అన్న రహీమ్ కుమారుడు అజహర్ రియల్ సెటిల్మెంట్లకు పాల్పడుతున్న అజీజ్గ్యాంగ్ను 2017 నవంబర్‌లో సంప్రదించాడు. భూవివాదం సెటిల్మెంట్ చేయాలని కోరిన అజహర్‌తో అజీజ్ గ్యాంగ్ సభ్యులు రూ.4లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఈమేరకు రూ.లక్ష అడ్వాన్స్ తీసుకున్న అజీజ్ గ్యాంగ్ తాము చెప్పినట్లు వినాలని రాజ్‌మహ్మద్‌ను హెచ్చరించారు. ఫలితం లేకపోవడంతో అతని హత్యకు పథకం పన్నారు. 2017 డిసెంబర్ 18న రాజ్‌మహ్మద్‌ను కిడ్నాప్‌చేసి ధర్మపురి మండలం తుమ్మెనాల అడవిలో హత్య చేసి పరారయ్యారు. రాజ్‌మహ్మద్ బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వారం తర్వాత ధర్మపురి అటవీప్రాంతంలో రాజ్‌మహ్మద్ మృతదేహాన్ని వెలికితీశారు. డిసెంబర్ చివరి వారంలో మృతుడి అన్న సోదరుడు అజహర్‌ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో రాజ్‌మహ్మద్‌ను సుఫారీగ్యాంగ్ హత్య చేసినట్లు తేలింది. అనంతరం ఈ హత్యకు సంబంధం ఉన్న అజీజ్గ్యాంగ్తోపాటు షబ్బీర్, ధర్మపురికి చెందిన బాబాను ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. ఈ హత్యలో కీలకంగా వ్యవహరించిన ముఠాసభ్యులు మహ్మద్ రఫీ(32), గంగేశ్వర్(31)ను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ ముఠా లీడర్ అజీజ్ కోసం గాలింపు చేపట్టామని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సైలు రవికుమార్, మధూకర్‌తోపాటు కానిస్టేబుళ్లు నరేశ్‌రావు, శేఖర్, సురేష్‌బాబు, పండరీలకు సీఐ రివార్డులు అందించారు. -
ఆ...ప్రాంతాలే టార్గెట్
ఆదోని టౌన్ : రద్దీ ప్రాంతాలే టార్గెట్‌గా దొంగనోట్ల ముఠా రెచ్చిపోయింది. పెట్రోల్ బంకులు, మార్కెట్‌యార్డు, బ్యాంకులు, మద్యం షాపులు, బార్లు.. ఇలా దేన్నీ వదలలేదు. దాదాపు 8 నెలల పాటు నకిలీ నోట్లను చలామణి చేసిందంటే వారి దందా ఏస్థాయిలో అర్థం చేసుకోవచ్చు. నకిలీ నోట్లపై ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముఠా ఆటకట్టించారు. శుక్రవారం డీఎస్పీ అంకినీడు ప్రసాద్ తన చాంబర్లో వివరాలు వెల్లడించారు. ముఠా గుట్టు రట్టయిందిలా.. పట్టణంలో కొన్ని నెలలుగా నకిలీ నోట్లు చలామణి జరుగుతున్నట్లు పోలీసులు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. ఈక్రమంలో గురువారం పట్టణంలోని సత్య భారత్ పెట్రోల్ బంకులో గుర్తు తెలియని వ్యక్తి రూ.రెండు వంద నోట్లు(నకిలీ) ఇచ్చి 2 లీటర్ల పెట్రోల్ పోయించుకొని చిల్లర తీసుకెళ్లాడు. నకిలీవని తేలడంతో బంకు మేనేజర్ అమీర్ షమీర్ ఖాన్ త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీఐ చంద్రశేఖర్, టూటౌన్ సీఐ వాసుకృష్ణ, ఎస్ఐ రామ్‌నాయక్, స్పెషల్ పార్టీ ఏఎస్ఐ ఆనంద్, సిబ్బంది రంగంలోకి దిగారు. ఈకమ్రంలో శుక్రవారం ఉదయం ఎమ్మిగనూరు రోడ్డు సర్కిల్లోని చిల్లీ డాబా దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆదోని మండలం 104 బసాపురం గ్రామానికి చెందిన కమ్మ కిష్టప్పను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారించడంతో నకిలీనోట్లు చలామణి చేస్తున్నట్లు అంగీకరించాడు. ఈ సందర్భంగా అతడి నుంచి రూ.25 వేల నకిలీ వంద నోట్లు, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు పత్తికొండ బస్టాండ్ సమీపంలో సోడాషాపు నిర్వహిస్తున్న సత్యనారాయణను అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.1.47 లక్షల నకిలీ వంద నోట్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఒకటికి మూడు నోట్లు నెల్లూరు జిల్లా కావలి చెందిన ఓ వ్యక్తి వద్ద ఒక ఒరిజినల్ నోటుకు మూడు నకిలీ నోట్ల చొప్పున తెచ్చుకున్నట్లు నిందితులు అంగీకరించారు. ఆదోని, కౌతాళం, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాలలో వాటిని చలామణి చేశారు. కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి కూడా నకిలీ నోట్లు సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగనోట్ల చలామణికి సంబంధించి సూత్రధారుల కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్పెషల్ పార్టీ ఏఎస్ఐ ఆనంద్, కానిస్టేబుళ్లు శాంతరాజు, ఎలిసా, రంగ, క్రిష్ణకు నగదు రివార్డు ప్రదానం చేశారు. సీఐలు చంద్రశేఖర్, వాసుకృష్ణకు అవార్డుల కోసం జిల్లా ఎస్పీకి సిఫారసు చేయనున్నట్లు డీఎస్పీ చెప్పారు. -
ఎర్రచందనం గ్యాంగ్ అరెస్ట్..
-
ఎర్రచందనం గ్యాంగ్ అరెస్ట్..
సాక్షి, రేణిగుంట: ఎర్రచందనం అక్రమ రవాణ చేస్తున్న ముఠాను ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం అంజనేయపురం చెక్ పోస్టు వద్ద ఫారెస్టు సిబ్బంది తనీఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అటువైపుగా వచ్చిన తమిళనాడుకి చెందిన TN 21BC 1806 కారును సిబ్బంది చెక్ చేశారు. ఆ కారులో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. కారులో ఉన్న 25 ఎర్ర చందనం దుంగలను ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనీఖీల్లో భాగంగా వారు కారు ఆపకుండా వెళ్లే ప్రయత్నాం చేశారు. సిబ్బందిపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడికి యత్నించారు. ఆ సమయంలో స్థానికులు ఫారెస్టు సిబ్బందికి సహాకరించారు. దీంతో సిబ్బంది స్మగ్లర్లను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్
సికింద్రాబాద్: పాత నోట్లును మార్పిడి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్ బేగంపేటలోని వెంకట్ రెసిడెన్సీలో బిల్డర్ యాదగిరి ఇంటిపై బేగంపేట పోలీసులు దాడులు చేశారు. పాత నోట్లను మార్పిడి చేస్తున్న 15 మంది సభ్యులున్న ముఠాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.