వివరాలు వెల్లడిస్తున్న సీపీ కమలాసన్‌రెడ్డి
కరీంనగర్‌క్రైం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలయాలే ప్రధాన లక్ష్యంగా ఏళ్లకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఓ వెండి విగ్రహం, రూ.5 లక్షల విలువైన బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.
ఎనిమిది మంది ముఠా..
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ పరిధిలోని తుర్కాశీనగర్‌కు చెందిన షేక్‌వలీ, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి పరిధిలోని ఇస్లాంనగర్‌కు చెందిన సయ్యద్ బాషా, సయ్యద్‌మదర్, అదే మండలం షాజుల్‌నగర్‌కు చెందిన షేక్‌బాబా, సిద్దిపేట జిల్లా పెద్దూర్ మండలం తుర్కాశీగ్రామానికి చెందిన సయ్యద్‌పాషాతో మరో ముగ్గురు మైనర్లను కలుపుకుని ముఠాగా ఏర్పడ్డారు.
ఆలయాలే టార్గెట్..
పొద్దంతా బండకొట్టే పని చేసే వీరు రాత్రి సమయంలో ఆలయాల్లో దొంగతనాలు చేయడం వృత్తిగా ఎంచుకున్నారు. రాత్రిపూట ఆటోలో సంచరిస్తూ.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం శివారులోని హనుమాన్ ఆలయంలో దొంగతనం చేశారు. చొప్పదండి మండలం వెదురుగట్టులోని మల్లికార్జున ఆలయం, పోచమ్మఆలయం, గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో పొచమ్మ గుడి, హిమ్మత్‌నగర్‌లోని ఎల్లమ్మ గుడి, కేశవపట్నం మండలం లింగాపూర్ గ్రామంలో ఎల్లమ్మగుడి, జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామంలోని మహాలక్ష్మి ఆలయం, కథలాపూర్ మండలంలోని కలికోట గ్రామంలో ఎల్లమ్మగుడి, సత్యనారాయణ ఆలయం, బుగ్గారం మండలంలోని మద్దునూర్ గ్రామంలోని పెద్ద పోచమ్మ ఆలయం, బీర్‌పూర్ మండలంలోని సీతారామచంద్ర ఆలయం, పెద్దపల్లి జిల్లాలోని పొత్కపల్లి మండలం కనగర్తి గ్రామంలోని ప ంచముఖ హనుమాన్ ఆలయం, జూలపల్లి మ ండలం నారాయణపల్లి గ్రామంలోని మహలక్ష్మి ఆలయం, రాజన్నసిరిసిల్ల జిల్లా పెద్దూర్ గ్రామం లోని ఒక ఇంట్లో చోరీ చేశారు.
ఇలా చిక్కారు...
కరీంనగర్‌జిల్లాలో పలు ఆలయాల్లో చోరీలు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో దొంగలను పట్టుకునేందుకు కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి పర్యవేక్షణలో చొప్పదండి సీఐ రమేశ్, గంగాధర ఎస్సై పుల్లయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏ ర్పాటు చేశారు. వీరికి సైబర్‌ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్‌చార్జి మురళి బృందం సహకారం అందించారు. చోరీచేసిన ఆభరణాలను అమ్మేందుకు బుధవారం చొప్పదండికి వస్తున్నారన్న సమాచారంతో స్థానికంగా ఆరుగురిని పట్టుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు కావడంతో జువైనల్ విచారణకు పంపించారు. మరో ముగ్గరిని అరెస్టు చేశారు. వారి నుంచి వెండి విగ్రహం, రూ.5లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 70వేల నగదు, ఆటో, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి గ్రామం ఇస్లాంనగర్‌కు చెందిన సయ్యద్ మదర్, పెద్దూర్ మండలం తుర్కశి గ్రామానికి చెందిన సయ్యద్‌భాషా పరారీలో ఉన్నారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న చొప్పదండి సీఐ రమేశ్, గంగాధర ఎస్సై పుల్లయ్య, సైబర్‌ఫోరన్సిక్ ఇన్‌చార్జి మురళి, చొప్పదండి హెడ్‌కానిస్టేబుల్ రాజమౌళి, కానిస్టేబుళ్లు కోటేశ్వర్, శ్రీనివాస్, శ్రీకాంత్‌కు సీపీ రివార్డులు అందించారు.
పోలీసుల అదుపులో ఇద్దరు దొంగలు..?
జగిత్యాలక్రైం: ధరూర్‌క్యాంప్‌లోని కోదండ రామాలయం, జగిత్యాల మండలం అంబారిపేట శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను టాస్క్‌ఫోర్స్ సీఐ సర్వర్ బృం దం పట్టుకున్నట్లు సమాచారం. అంబారిపేట గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో 15రోజుల క్రితం స్వామివారి ఆభరణాలు, నగదు చోరీకి గురైంది. కోదండ రామాలయంలోనూ 4 తులాల బంగారం, రూ.5 వేల నగదు చోరీకి రైం ది. జిల్లా ఎస్పీ సునీల్‌దత్ ఆలయాన్ని స్వయంగా పరిశీలించి రెండు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీపుటేజీల ఆధారంగా దొంగలను గుర్తించారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాగర్‌ను టాస్ ్కఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. రమేశ్‌ను టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment