సరిహద్దు వద్ద రూ.135 కోట్ల డ్రగ్స్‌ రవాణా యత్నం! | BSF Eliminates Pakistani Smuggler In Kathua | Sakshi
Sakshi News home page

సరిహద్దు వద్ద రూ.135 కోట్ల డ్రగ్స్‌ రవాణా యత్నం!

Published Thu, Jun 24 2021 8:09 AM | Last Updated on Thu, Jun 24 2021 8:10 AM

BSF Eliminates Pakistani Smuggler In Kathua - Sakshi

జమ్మూ: భారత్‌–పాక్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంట మాదకద్రవ్యాల అక్రమరవాణా ప్రయత్నానికి బీఎస్‌ఎఫ్‌ బలగాలు అడ్డుకట్టవేశాయి. మార్కెట్లో రూ.135 కోట్ల విలువచేసే 27 కేజీల హెరాయిన్‌ను భారత భూభాగంలోకి తీసుకొస్తున్న పాకిస్తానీ స్మగ్లర్‌ను బీఎస్‌ఎఫ్‌ బలగాలు హతమార్చాయి.

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో భారత్‌–పాక్‌ సరిహద్దు వెంట పర్సర్‌ బోర్డర్‌ ఔట్‌పోస్ట్‌ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి దాటాక(తెల్లారితే బుధవారం) 2.30–3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను బీఎస్‌ఎఫ్‌(జమ్మూ) ఐజీ ఎన్‌ఎస్‌ జామ్వాల్‌ వెల్లడించారు.

చదవండి:  పార్లమెంటరీ కమిటీ భేటీలో హైడ్రామా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement