లండన్: పేరుమోసిన మాదక ద్రవ్యాల స్మగ్లర్ కిషన్ సింగ్‌ను(38) బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న కిషన్ సింగ్ భారత్‌లో వాంటెడ్ నేరగాడిగా పోలీసు రికార్డులక్కాడు. లండన్ మెట్రోపాలిటన్ పోలీసు శాఖ అతడిని ఇండియాకు అప్పగించింది. రాజస్తానీ మూలాలున్న కిషన్ సింగ్ బ్రిటీష్ పౌరుడు. 2016–17లో ఇండియాలో మెఫాడ్రోన్ (వైట్ మ్యాజిక్), మ్యావ్ మ్యావ్, కెటామైన్ అనే మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేసినట్లు అతడిపై కేసు నమోదయ్యింది. 2018లో లండన్‌లో అక్కడి పోలీసులు కిషన్ సింగ్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment