extradited
-
స్మగ్లర్ కిషన్ సింగ్ భారత్‌కు అప్పగింత
లండన్: పేరుమోసిన మాదక ద్రవ్యాల స్మగ్లర్ కిషన్ సింగ్‌ను(38) బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న కిషన్ సింగ్ భారత్‌లో వాంటెడ్ నేరగాడిగా పోలీసు రికార్డులక్కాడు. లండన్ మెట్రోపాలిటన్ పోలీసు శాఖ అతడిని ఇండియాకు అప్పగించింది. రాజస్తానీ మూలాలున్న కిషన్ సింగ్ బ్రిటీష్ పౌరుడు. 2016–17లో ఇండియాలో మెఫాడ్రోన్ (వైట్ మ్యాజిక్), మ్యావ్ మ్యావ్, కెటామైన్ అనే మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేసినట్లు అతడిపై కేసు నమోదయ్యింది. 2018లో లండన్‌లో అక్కడి పోలీసులు కిషన్ సింగ్‌ను అరెస్టు చేశారు. ఎవరీ కిషన్ సింగ్? రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా రేవంత్ గ్రామం కిషన్ సింగ్ జన్మస్థలం. త్వరగా డబ్బు సంపాదించాలనే కలతో అతడు 2009 లో లండన్ వెళ్లి అక్కడ విండో-తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కిషన్ 2013 లో భారతదేశానికి వచ్చి రాజస్థాన్‌లో వివాహం చేసుకుని మళ్లీ లండన్‌కు వెళ్లాడు. ఆరేళ్లపాటు లండన్‌లో ఉన్న తరువాత కిషన్ సింగ్ 2015 లో యునైటెడ్ కింగ్డమ్ పౌరుడు అయ్యాడు. 2016 నుంచి అతడి చీకటి వ్యాపారాలు బట్టబయలయ్యాయి. ముంబైలోని ఏజెంట్ల ద్వారా మహారాష్ట్ర నుంచి మత్తు పదార్థాలను సరఫరా చేసినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోనూ ఏజెంట్లను నియమించుకుని యూఏఈ, యూకే, యూఎస్ఏ, మలేసియా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో డ్రగ్స్ దందా సాగించినట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ సంజీవ్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా 2017, ఫిబ్రవరి 15న ముగ్గురు మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 50 కోట్లు విలువ చేసే ‘మ్యావ్ మ్యావ్’ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. లండన్‌లో ఉన్న కిషన్ సింగ్ ఆదేశాలకు అనుగుణంగా తాము డ్రగ్స్ సరఫరా చేస్తున్నామని పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. -
మాదక ద్రవ్యాల స్మగ్లర్ కిషన్ సింగ్ భారత్‌కు అప్పగింత
లండన్: పేరుమోసిన మాదక ద్రవ్యాల స్మగ్లర్ కిషన్ సింగ్‌ను(38) బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న కిషన్ సింగ్ భారత్‌లో వాంటెడ్ నేరగాడిగా పోలీసు రికార్డులక్కాడు. లండన్ మెట్రోపాలిటన్ పోలీసు శాఖ అతడిని ఇండియాకు అప్పగించింది. రాజస్తానీ మూలాలున్న కిషన్ సింగ్ బ్రిటీష్ పౌరుడు. 2016–17లో ఇండియాలో మెఫాడ్రోన్ (వైట్ మ్యాజిక్), మ్యావ్ మ్యావ్, కెటామైన్ అనే మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేసినట్లు అతడిపై కేసు నమోదయ్యింది. 2018లో లండన్‌లో అక్కడి పోలీసులు కిషన్ సింగ్‌ను అరెస్టు చేశారు. -
భారత్‌కు అప్పగిస్తే చచ్చిపోతా
లండన్: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(48)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం నాలుగోసారి అతడు పెట్టుకున్న పిటిషన్‌ను లండన్ కోర్టు తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ని రూ.14వేల కోట్ల మేర మోసం చేసిన ఆరోపణలపై అతడిని అప్పగించాలంటూ భారత్ కోరుతున్న విషయం తెలిసిందే. మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నందున నీరవ్‌కు బెయిల్ ఇవ్వాలని లాయర్లు వాదించారు. బాండ్ మొత్తాన్ని రూ.18 కోట్ల నుంచి రూ.36 కోట్ల(4 మిలియన్ పౌండ్లు)కు పెంచేందుకు అంగీకరించినా వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించారు. విచారణ ముగిసిన తర్వాత అతడిని నైరుతి లండన్‌లోని వాన్‌డ్స్‌వర్త్ జైలుకు తరలించారు. డిసెంబర్ 4న వీడియో లింక్ ద్వారా అతడిని కోర్టు విచారించనుంది. నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌ను భారత్ తరపున వాదిస్తున్న న్యాయవాది సవాల్ చేశారు. తనను భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని నీరవ్ మోదీ బెదిరిస్తున్న విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జైలులో తన క్లైంట్‌పై దాడి జరిగిందని నీరవ్‌మోదీ తరపు లాయర్ వెల్లడించారు. అతడిపై భారత్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, దీనికి అక్కడి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆరోపించారు. -
అగస్టా కుంభకోణంలో కీలక ముందడుగు
సాక్షి, న్యూఢిల్లీ: 3600 కోట్ల రూపాయల అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో నిందితులు దుబాయ్ వ్యాపారవేత్త రాజీవ్ సక్సేనా, కార్పొరేట్ లాబీయిస్టు దీపక్ తల్వార్‌ను యూఏఈ భారత్‌కు అప్పగించింది. వారిద్దరినీ గురువారం తెల్లవారుజామున స్వదేశానికి తీసుకొచ్చారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు సక్సేనా, తల్వార్లను అప్పగించనున్నారు. ఇటీవలే ఈ కుంభకోణం కేసులో సహ నిందితుడు, మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను దుబాయి నుంచి తీసుకొచ్చి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అగస్టా వ్యవహారంలో సక్సేనాకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సక్సేనాకు ఈడీ అనేకసార్లు సమన్లు పంపింది. గతేడాది జులైలో సక్సేనా భార్య శివాని సక్సేనాను కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నారు. ఇక దీపక్ తల్వార్‌పై కూడా అవినీతి, పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి. -
మైకేల్‌ను అప్పగించిన యూఏఈ
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ మైకేల్(57)ను యూఏఈ భారత్‌కు అప్పగించింది. మంగళవారం రాత్రే ఆయన్ని దుబాయ్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. బ్రిటన్ జాతీయుడైన మైకేల్ అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు పుచ్చుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 2016లో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో మైకేల్‌తో పాటు గైడో హాష్కే, కార్లో గెరోసా అనే మధ్యర్తులపైనా ఈడీ, సీబీఐలు దర్యాప్తు జరుపుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యవేక్షణలో చేపట్టిన ఆపరేషన్ మూలంగానే మైకేల్‌ను భారత్‌కు అప్పగించేందుకు యూఏఈ అంగీకరించిందని సీబీఐ తెలిపింది. సీబీఐ డైరెక్టర్ ఎం.నాగేశ్వర రావు ఈ ఆపరేషన్‌ను సమన్వయపరచగా, జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్ నేతృత్వంలోని బృందం..మైకేల్‌ను తెచ్చేందుకు దుబాయ్ వెళ్లిందని వెల్లడించింది. వైమానిక దళ మాజీ చీఫ్‌తో కుమ్మక్కు.. హెలికాప్టర్ల కుంభకోణంలో మైకేల్ పాత్ర 2012లో వెలుగుచూసింది. ఒప్పందాన్ని ఆ కంపెనీకే కట్టబెట్టేలా భారత అధికారులకు అతడు అక్రమంగా చెల్లింపులు జరిపినట్లు సీబీఐ ఆరోపించింది. సహనిందితులైన నాటి వైమానిక దళ చీఫ్ ఎస్పీ త్యాగి, ఆయన కుటుంబీకులతో కలసి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తెలిపింది. విచారణ నుంచి తప్పించుకోవడానికి అతడు విదేశాలకు పారిపోయాడని సీబీఐ వెల్లడించింది. దీంతో మైకేల్‌పై 2015లో నాన్–బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ వారెంట్ ఆధారంగా ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేయడంతో 2017 ఫిబ్రవరిలో దుబాయ్‌లో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అక్కడే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని అతను పెట్టుకున్న అభ్యర్థనను అక్కడి కోర్టు కొట్టివేయడంతో భారత అధికారుల శ్రమ ఫలించినట్లయింది. ‘గాంధీ’లకు కష్టాలు తప్పవు: బీజేపీ మైకేల్ అప్పగింతతో గాంధీ కుటుంబానికి చిక్కులు తప్పవని బీజేపీ హెచ్చరించింది. అవినీతిపై మోదీ ప్రభుత్వం సాగిస్తున్న తిరుగులేని పోరాటానికి తాజా పరిణామమే ఉదాహరణ అని బీజేపీ పేర్కొంది.మైకేల్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకున్న తరువాత ఈ కుంభకోణంలో అసలు దోషులెవరో తెలుస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియాకు మైకేల్ విశ్వాసపాత్రుడనే పేరుంది. ఏమిటీ కుంభకోణం? రూ.3600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్లు కొనేందుకు 2010, ఫిబ్రవరిలో నాటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘనకు గురవడంతో పాటు రూ.423 కోట్ల ముడుపులు చేతులు మారాయని, కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో 2014 జనవరి 1న ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హెలి కాప్టర్లు ఎగిరే ఎత్తు పరిమితిని 6 వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించి కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఎత్తు తగ్గించడం ద్వారానే అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందం చేసుకోవడానికి అర్హత సాధించిందని తెలిపింది. -
మాల్యాను ఇండియాకు ఎపుడు రప్పిస్తారు?
-
మాల్యాను ఇండియాకు ఎపుడు రప్పిస్తారు?
ముంబై: వేలకోట్ల రూపాయలను ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఎట్టకేలకు చెక్ పడింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంతోంది. అయితే మాల్యాను ఇండియాకు రప్పించేందుకు తీవ్రంగా శ్రమించిన ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సీబీఏ చివరకు విజయం సాధించాయి. స్కాట్లాండ్ పోలీసులు లండన్ లో మంగళవారం ఉదయం ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం వెస్ట్ మినిస్టర్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మాల్యాను త్వరలోనే భారత్ కు తీసుకున్నారని తెలుస్తోంది. అయితే న్యాయపరంగా ఈ మొత్తం ప్రక్రియ ముగిసి మాల్యాను ఇండియాకు రప్పించేందుకు మరో నెల రోజులుపట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మాల్యా అరెస్ట్‌పై కింగ్‌ఫిషర్ మాజీ ఉద్యోగి నీతూ స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె ఇది మీడియాకు మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. ఇది న్యూస్ చానల్స్ సాధించిన గొప్ప విజయమని ఆమె వ్యాఖ్యానించారు. అయితే మాల్యా అరెస్ట్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది మంచి పరిణామమని భావిస్తున్నారు. అయితే భారత్ రప్పించేందుకు మరో కీలక అడుగు ముందుకు పడిందని అభిప్రాయపడ్డారు. ఇది ఇతర లోన్ డిఫాల్టర్లకు ఒక హెచ్చరిక లాంటిదని పేర్కొంటున్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరిట రూ. 9 వేల కోట్లను బ్యాంకుల నుంచి రుణాలుగా పొందిన మాల్యా.. వాటిని తిరిగి చెల్లించకుండా లండన్ పారిపోయారు. ఈ రుణాలను రాబట్టేందుకు సుమారు 17బ్యాంకులు ఎస్బీఐ ఆధ్వర్యంలో ఓ కన్సార్టియంగా ఏర్పడ్డాయి. తమ రుణాలను ఇప్పించాల్సింది సుప్రీంను ఆశ్రయించాయి. ఈ కేసు విచారణలో భాగంగా భారతదేశంలో మాల్యాపై మనీ లాండరింగ్ సహా పలు కేసులలో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యాయి. ఇటీవల సీబీఐ రెడ్ కార్నర్ నోటీస్‌లు జారీ చేయగా, మాల్యాను దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాదికాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భారత అధికారుల అభ్యర్థనపై ఇటీవల బ్రిటీష్ అధికారులు పాజిటివ్‌గా స్పందించారు. గత నెల భారతదేశం అభ్యర్థనను మన్నించిన బ్రిటిష్ ప్రభుత్వం తదుపరి చర్య కోసం జిల్లా జడ్జికి పంపించిన సంగతి తెలిసిందే. -
మాల్యాకు షాక్...కీలక పరిణామం
న్యూఢిల్లీ: వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను తిరిగి దేశానికి రప్పించే ప్రక్రియలో మరో కీలక అడుగు పడింది. సుమారు రూ 9,000 కోట్ల మేరకు రుణ డిఫాల్ట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాను వెనక్కి రప్పించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా విదేశాంగ శాఖ అభ్యర్థనను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు యూకే మాజిస్ట్రేట్ మాల్యాపై అరెస్ట్ వారెంట్ జారీ చేయొచ్చని భావిస్తున్నారు. పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాను అప్పగించే విషయంలో భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అభ్యర్థను బ్రిటన్ స్టేట్ సెక్రటరీ ఆమోదించిందని పీటీఐ నివేదించింది. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను అప్పగించాల్సిందిగా కోరుతూ ఎక్‌ట్రాడిషన్ రిక్వెస్ట్ ను భారత విదేశాంగ శాఖ బ్రిటన్ ప్రభుత్వానికి అంద జేసింది. నేరస్థుల అప్పగింతకు సంబంధించి భారత్ –బ్రిటన్ ల 1993 నాటి ఒప్పందం నేపథ్యంలో విజయ్ మాల్యాను బ్రిటన్ అప్పగించాలని కోరింది. కాగా మాల్యాను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు ఇంకా పెండింగ్ లోఉన్నాయని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి కె సింగ్ గురువారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. గత అయిదు సంవత్సరాల కాలంలో ఫ్యుజిటివ్ క్రిమినల్ సమీర్ బాయ్ విను భాయ్ పటేల్ ఒక్కడినే రప్పించగలిగామని చెప్పారు. మాల్యాతో సహా పారిపోయిన నేరస్తులకు సంబంధించి భారత 10 అప్లికేషన్లు బ్రిటన్ లో పెండింగ్ లో ఉన్నట్టు చెప్పారు.