అగస్టా కుంభకోణంలో కీలక ముందడుగు | Agustawestland Accused Rajiv Saxena And Lobbyist Deepak Talwar Extradited To India | Sakshi
Sakshi News home page

అగస్టా కుంభకోణంలో కీలక ముందడుగు

Published Thu, Jan 31 2019 11:40 AM | Last Updated on Thu, Jan 31 2019 1:06 PM

Agustawestland Accused Rajiv Saxena And Lobbyist Deepak Talwar Extradited To India - Sakshi

రాజీవ్‌ సక్సేనా

సాక్షి, న్యూఢిల్లీ: 3600 కోట్ల రూపాయల అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో నిందితులు దుబాయ్‌ వ్యాపారవేత్త రాజీవ్‌ సక్సేనా, కార్పొరేట్‌ లాబీయిస్టు దీపక్‌ తల్వార్‌ను యూఏఈ భారత్‌కు అప్పగించింది. వారిద్దరినీ గురువారం తెల్లవారుజామున స్వదేశానికి తీసుకొచ్చారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు సక్సేనా, తల్వార్‌లను అప్పగించనున్నారు. ఇటీవలే ఈ కుంభకోణం కేసులో సహ నిందితుడు, మధ్యవర్తి క్రిస్టియన్‌ మిషెల్‌ను దుబాయి నుంచి తీసుకొచ్చి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అగస్టా వ్యవహారంలో సక్సేనాకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సక్సేనాకు ఈడీ అనేకసార్లు సమన్లు పంపింది. గతేడాది జులైలో సక్సేనా భార్య శివాని సక్సేనాను కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నారు. ఇక దీపక్‌ తల్వార్‌పై కూడా అవినీతి, పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement