Agusta Scam
-
విదేశీయుడని ఎన్నాళ్లు కస్టడీలో ఉంచుతారు?
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్‌ను విదేశీయుడన్న కారణంతో ఎన్ని రోజులు పోలీసు కస్టడీలో ఉంచుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అతను భారతీయుడు కాకపోవడంతో నాలుగేళ్లకు పైగా కస్టడీలో ఉంచడం సమర్థనీయమా అని ప్రశ్నించింది. ఇది అతని స్వేచ్ఛను పూర్తిగా అణిచివేయడమేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పిఎస్.నరసింహలతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. బ్రిటన్ జాతీయుడైన మైఖేల్‌ను దుబాయ్ 2018లో భారత్‌కు అప్పగించింది. అప్పట్నుంచి అతను పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మైఖేల్ సుప్రీంలో సవాల్ చేశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం .. విదేశీయుడైనందుకు అతను అలాగే కస్టడీలో మగ్గిపోవాలా ? అని వ్యాఖ్యానించింది. మైఖేల్ జేమ్స్ అప్పగింత సమయంలో జరిగిన ఒప్పందం వివరాలన్నింటినీ కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 2023 జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ఇదీ చదవండి: ఇకపై సహజీవనం నేరమే.. ఆరు నెలల జైలు శిక్ష -
కాంగ్రెస్ సీనియర్ నేతకు బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రిక అవినీతి కేసులో మరో కాంగ్రెస్ సీనియర్ నేతకు షాక్ తగిలింది. ఈ కేసులో భాగంగా రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖార్గేకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు పంపించింది. సోమవారం విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వచ్చిన ఖర్గేను అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణలో పలు అంశాలపై స్పష్టత కోసం ఆయనను పిలిచినట్లు వెల్లడించారు. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. అగస్టా వెస్ట్‌లాండ్ చాపర్ కుంభకోణం కేసులో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి, మాజీ కాగ్ శశికాంత్ శర్మకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నలుగురు రిటైర్డ్ అధికారులతో పాటు అంతకుముందు సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఉన్న నిందితులందరికీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు పంపింది. వీరంతా ఏప్రిల్ 28వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి అనుకూలంగా పనిచేసేందుకు అవినీతికి పాల్పడ్డారన్న వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ఈ ఒప్పందం చేసుకోగా.. ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. -
మేనల్లుడి వ్యాపారంతో సంబంధం లేదు: ముఖ్యమంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడు, వ్యాపారవేత్త రతుల్ పురిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ అధికారులు బ్యాంక్ మోసం కేసులో సోమవారం అర్థరాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే రతుల్ పూరి అరెస్టు నేపథ్యంలో తన మేనల్లుడి వ్యాపారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను వాటాదారుడి కానని కమల్ నాథ్ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ఉద్దేశపూర్వక చర్య అని, ఈ విషయంలో కోర్టులపై తనకు పూర్తి నమ్మకం ఉందని రతుల్ పూరి అరెస్టుపై ఆయన అభిప్రాయపడ్డారు. చదవండి: సీఎం మేనల్లుడికి ఈడీ షాక్ కాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన 354 కోట్ల రూపాయల బ్యాంకు మోసం కేసులో రతుల్ పురి, అతని తండ్రి దీపక్ పురి, తల్లి నీతా (నాథ్ సోదరి), ఇతరులపై గతవారం (ఆగస్టు 17న) సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో రతుల్ పూరిని మూడు ప్రధాన కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేస్తున్నాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసుకు సంబంధించి రతుల్ పూరిని విడిగా విచారిస్తున్నారు. అంతేకాక సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే కారణంగా అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరైన తర్వాత అతడిని నిందితుడుగా అరెస్టు చేశారు. ఈ మేరకు పూరీని కస్టడీలోకి (అదుపులో) తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. మరోవైపు రతుల్ పురి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. -
చార్జిషీటు లీకేజీపై విచారణ
న్యూఢిల్లీ: రూ.3,600 కోట్ల అగస్టావెస్ట్‌ల్యాండ్ కుంభకోణం చార్జిషీటు వివరాలు బయటకు వెల్లడి కావడంపై దర్యాప్తు చేయించాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఈ కేసులో అరెస్టయిన మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా, చార్జిషీటులోని వివరాలను ఎలా సంపాదించారో తెలపాలంటూ సదరు వార్తా సంస్థను ఆదేశించాలని ఈడీ.. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న ఈడీపై విచారణ జరపాలంటూ క్రిస్టియన్ మిషెల్ పిటిషన్లు వేశారు. ‘కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ చార్జిషీటు ప్రతులను ఈ కేసులోని నిందితులకు మేం ఇంకా ఇవ్వనేలేదు. అయినా అందులో ఏముందో మిషెల్ లాయర్లకు తెలిసింది. ఆ ప్రకారమే వారు పిటిషన్ వేశారు. దీనిని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. చార్జిషీటు వివరాలు వెల్లడిపై దర్యాప్తు జరగాలి’ అని ఈడీ వాదించింది. తమ క్లయింట్‌కు చార్జిషీటు కాపీని ఇవ్వకమునుపే ఈడీ మీడియాకు లీక్ చేసిందని మిషెల్ లాయర్ ఆరోపించారు. కోర్టు ప్రత్యేక జడ్జి ఈ వ్యవహారంపై 11న విచారిస్తామన్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సప్లిమెంటరీ చార్జిషీటు ప్రతిని సీల్డు కవర్లో భద్రపరచాలని ఈడీని ఆదేశించారు. హెలికాప్టర్ల కొనుగోలు కోసం అప్పటి కేంద్రప్రభుత్వం, అగస్టావెస్ట్‌ల్యాండ్‌ల మధ్య 2010నాటి ఒప్పందం వల్ల ఖజానాకు రూ.2,666 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ గతంలో తెలిపింది. -
అగస్టా కేసులో ఈడీ మరో చార్జిషీటు
న్యూఢిల్లీ: అగస్టావెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో అరెస్టయిన మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్, తదితరులు రూ.300 కోట్ల మేర లబ్ధి పొందారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పేర్కొంది. 3వేల పేజీల రెండో చార్జిషీటును గురువారం ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. ఈ చార్జిషీటులో మిషెల్ వ్యాపార భాగస్వామి డేవిడ్ సిమ్స్‌నూ చేర్చింది. వీరిద్దరూ గ్లోబల్ ట్రేడ్ అండ్ కామర్స్, గ్లోబల్ సర్వీసెస్ ఎఫ్జెడ్ఈ అనే సంస్థలు నడుపుతున్నారు. భారత ప్రభుత్వం, ఇటలీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ అగస్టావెస్ట్‌ల్యాండ్‌తో 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా మిషెల్, సిమ్స్ తదితరులు ఈ సొమ్మును పొందారని ఈడీ పేర్కొంది. ఆ రూ.300 కోట్ల సొమ్ము అగస్టా సంస్థే గ్లోబల్ ట్రేడ్ అండ్ కామర్స్, గ్లోబల్ సర్వీసెస్‌లకు చెల్లించిందని ఆరోపించింది. ఈడీ తాజా చార్జిషీటును పరిగణనలోకి తీసుకోవాలో వద్దో ఈ నెల 6వ తేదీన ప్రకటిస్తానని స్పెషల్ జడ్జి తెలిపారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసుకు సంబంధించి మిషెల్, ఇతర మధ్యవర్తులు రూ.225 కోట్ల మేర లబ్ధి పొందారని 2016లో న్యాయస్థానానికి సమర్పించిన మొదటి చార్జిషీటులో ఈడీ పేర్కొంది. -
దీపక్ తల్వార్,రాజీవ్ సక్సేనాకు ఈడీ కస్టడీ
-
అగస్టా కేసులో సక్సేనా అరెస్ట్
న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త రాజీవ్ సక్సేనాతో పాటు రూ.90 కోట్ల నిధులను మళ్లించిన కేసులో నిందితుడు, లాబీయిస్టు దీపక్ తల్వార్‌ను దుబాయ్ అధికారులు భారత్‌కు అప్పగించారు. ఢిల్లీ విమానాశ్రయానికి గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు చేరుకున్న వీరిని ఈడీ అధికారులు వెంటనే అరెస్ట్ చేశారు. అనంతరం సక్సేనాను అధికారులు ఢిల్లీలోని ఓ కోర్టు ముందు ప్రవేశపెట్టగా నాలుగు రోజుల కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీచేశారు. అదేవిధంగా, ఓ విదేశీ క్షిపణి తయారీ కంపెనీ నుంచి తన ఎన్జీవోకు వచ్చిన రూ.90.72 కోట్ల ను దారి మళ్లించిన కేసులో దీపక్ తల్వార్‌ను పటియాలా కోర్టు ఏడురోజుల కస్టడీకీ అనుమతించింది. -
అగస్టా కుంభకోణంలో కీలక ముందడుగు
సాక్షి, న్యూఢిల్లీ: 3600 కోట్ల రూపాయల అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో నిందితులు దుబాయ్ వ్యాపారవేత్త రాజీవ్ సక్సేనా, కార్పొరేట్ లాబీయిస్టు దీపక్ తల్వార్‌ను యూఏఈ భారత్‌కు అప్పగించింది. వారిద్దరినీ గురువారం తెల్లవారుజామున స్వదేశానికి తీసుకొచ్చారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు సక్సేనా, తల్వార్లను అప్పగించనున్నారు. ఇటీవలే ఈ కుంభకోణం కేసులో సహ నిందితుడు, మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను దుబాయి నుంచి తీసుకొచ్చి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అగస్టా వ్యవహారంలో సక్సేనాకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సక్సేనాకు ఈడీ అనేకసార్లు సమన్లు పంపింది. గతేడాది జులైలో సక్సేనా భార్య శివాని సక్సేనాను కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నారు. ఇక దీపక్ తల్వార్‌పై కూడా అవినీతి, పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి. -
అగస్టా వెస్ట్‌లాండ్ కేసులో కొత్త మలుపు
-
అధికారుల ప్రయాణాలకు రూ.92 లక్షలు
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మిషెల్ ఎయిర్‌ఫోర్స్ అధికారుల విమాన ప్రయాణాల కోసం రూ.92 లక్షలు ఖర్చు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. సుమారు రూ.2,666 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం కలిగించిన ఈ కుంభకోణంలో పలు కీలక విషయాలపై మిషెల్ సమాధానం ఇవ్వాల్సి ఉందని పేర్కొన్న సీబీఐ..మరో ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలంటూ శనివారం ప్రత్యేక కోర్టును కోరింది. అయితే, ఆ అధికారుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. 2009, 2013 సంవత్సరాల మధ్య ఎయిర్‌ఫోర్స్ అధికారుల ప్రయాణాల కోసం రూ.92 లక్షలను మిచెల్ వెచ్చించాడని తెలిపింది. అతడిని ముంబైలోని పవన్ హన్స్ ఇండియా లిమిటెడ్ కార్యాలయానికి తీసుకెళ్లి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని పేర్కొంది. ఈ కుంభకోణానికి సంబంధించి వివిధ దేశాల నుంచి సేకరించిన పత్రాల్లోని అంశాలపై మిషెల్ మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉందని తెలిపింది. మిషెల్‌ను మరో నాలుగు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించిన న్యాయస్థానం..అతడితో పది నిమిషాలపాటు మాట్లాడేందుకు లాయర్ రోజ్మేరీకి అవకాశం ఇచ్చింది. -
ఎవరీ మైకేల్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: అగస్టా కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మధ్యవర్తి, బ్రిటిషర్ క్రిస్టియన్ మైకేల్‌ను ఢిల్లీలోని ఓ కోర్టు ఐదు రోజుల పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కస్టడీకి అప్పగించింది. భారత్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి సహా పలువురు వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో 12 విలాసవంతమైన హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మైకేల్‌ను సీబీఐ అధికారులు నిన్న రాత్రి యూఏఈ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన్ను గట్టి భద్రత నడుమ ఢిల్లీలోని కోర్టు ముందు సీబీఐ అధికారులు హాజరుపర్చారు. అగస్టా కుంభకోణంలో లోతైన కుట్ర దాగుందనీ, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల పాత్రపై దర్యాప్తు జరపడానికి వీలుగా 14 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయవాది డీపీ సింగ్ కోరారు. దీంతో సీబీఐ ప్రత్యేక జడ్జి.. మైకేల్‌ను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించారు. అగస్టా ఒప్పందంలో భాగంగా మైకేల్ రూ.225 కోట్లు అందుకున్నారనీ, ఈ మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలు, ఐఏఎఫ్ అధికారులకు లంచంగా చెల్లించారని సీబీఐ చార్జిషీటులో తెలిపింది. అలాగే మైకేల్ కంపెనీ గ్లోబల్ సర్వీసెస్ ద్వారా ఢిల్లీలోని ఓ మీడియా సంస్థలోకి నగదు వచ్చిన విషయాన్ని తాము గుర్తించినట్లు ఈడీ వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం ముదిరింది. మైకేల్‌పై తప్పుడు వాంగ్మూలం ఇప్పించి ప్రతిపక్ష నేతలపై బురద చల్లేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అగస్టా కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్న మైకేల్‌ను కాపాడాలనుకుంటోందా? అని బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఇబ్బంది తప్పదా! మైకేల్‌ను విచారించడం ద్వారా అగస్టా కుంభకోణంలో కాంగ్రెస్ నేతల పాత్రపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయనీ, తద్వారా కాంగ్రెస్‌ను రాజకీయంగా ఇరుకునపెట్టాలని కేంద్రం భావిస్తోంది. విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ వంటి ఆర్థిక నేరస్తులను వెనక్కి రప్పించడంలో బీజేపీ సర్కారు విఫలమయిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టేందుకు మైకేల్‌ను బీజేపీ ఆయుధంగా ఉపయోగించుకుంటుందని పరిశీలకులు అంటున్నారు. ఈ ఒప్పందం కుదరాలంటే సోనియాగాంధీని ప్రసన్నం చేసుకోవాలంటూ 2008లో అప్పటి అగస్టా కంపెనీ భారత్ విభాగం చీఫ్ పీటర్ హ్యూలెట్‌కు రాసిన లేఖలో మైకేల్ సూచించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ అధికారులు ఇప్పటికే మైకేల్ డైరీని సంపాదించారు. అగస్టా ఒప్పందం కోసం ఎవరెవరికి ఎంత ముడుపులు ఇచ్చింది మైకేల్ తన డైరీలో కోడ్ భాషలో రాసుకున్నారు. కాగా, అగస్టా కుంభకోణానికి సోనియాకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు ఒత్తిడి చేసి మైకేల్ చేత బలవంతపు వాంగ్మూలం ఇప్పించారని ఆరోపించింది. సల్వార్కమీజ్లో పారిపోయేందుకు యత్నం! భారత అధికారులకు దొరక్కుండా ఉండేందుకు మైకేల్ చాలా వ్యూహాలు రచించాడు. తొలుత దుబయ్ పోలీసులు తనను అరెస్ట్ చేయగానే తాను బ్రిటన్ పౌరుడ్ని అయినందున భారత్‌కు అప్పగించడం కుదరదని వాదించారు. వెంటనే అప్రమత్తమైన జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్ మైకేల్ చేజారిపోకుండా ఏడాది క్రితం సీబీఐ, నిఘా సంస్థ ‘రా’ అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటుచేశారు. సెప్టెంబర్‌లో దుబయ్‌లోని కోర్టు ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేసింది. దీంతో సల్వార్ కమీజ్, టోపీ ధరించి మారువేషంలో పారిపోయేందుకు మైకేల్ యత్నించగా భారత నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అయన్ను పట్టుకున్నారు. దౌత్యమార్గంలోనూ ఒత్తిడి పెంచడంతో యూఏఈ మైకేల్‌ను భారత్‌కు అప్పగించింది. ఎవరీ మైకేల్? బ్రిటన్ పౌరుడైన మైకేల్ వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. భారత్ నుంచి అగస్టాకు కాంట్రాక్టులు సాధించిపెట్టడమే మైకేల్ పని. మైకేల్ తండ్రి వోల్ఫ్‌గంగ్ మైకేల్ సైతం 1980లలో వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి ఇండియాలో కన్సల్టెంట్‌గా చేశారు. ఆయన మూడు కంపెనీలు నిర్వహించారు. తరచూ భారత్‌లో పర్యటించే మైకేల్‌కు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో స్నేహం ఏర్పడింది. పరిచయాలను స్వదినియోగం చేసుకున్న ఆయన భారత్ నుంచి 12 హెలికాప్టర్ల కాంట్రాక్టును అగస్టా కంపెనీకి ఇప్పించేందుకు రంగంలోకి దిగారు. ఇందుకోసం రాజకీయ నేతలకు, ఐఏఎఫ్ అధికారులకు భారీగా లంచాలిచ్చారు. దీంతో అప్పటివరకూ హెలికాప్టర్ ప్రయాణించే ఎత్తు పరిమితిని అధికారుల సాయంతో 6,000 మీటర్ల నుంచి 4,500కు తగ్గించగలిగారు. దీంతో అప్పటివరకూ రేసులోనే లేని అగస్టా ఏకంగా కాంట్రాక్టునే ఎగరేసుకుపోయింది. భారత రక్షణ, వైమానిక దళాలకు చెందిన రహస్య పత్రాలు, సమాచారాన్ని సంపాదించిన మైకేల్ ముంబైలోని తన సహాయకుడి ద్వారా దాన్ని వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి చేరవేయగలిగాడు. వీవీఐపీ హెలికాప్టర్ కొనుగోలు ప్రక్రియ మొదలయ్యాక 1997–2013 మధ్యకాలంలో మైకేల్ 300 సార్లు ఇండియాకు వచ్చాడు. -
చాయ్‌వాలా కోర్టు మెట్లెక్కించాడు
సుమేర్పూర్/దౌసా: నాలుగు తరాలపాటు దేశాన్ని పాలించిన గాంధీల కుటుంబాన్ని నేడు ఓ చాయ్‌వాలా కోర్టు వరకు తీసుకొచ్చాడని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలను రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి 2011–12 ఆర్థిక సంవత్సరంలో రాహుల్, ఆయన తల్లి సోనియా గాంధీల ఆదాయపు పన్ను వివరాలను తనిఖీ చేసేందుకు సుప్రీంకోర్టు మంగళవారమే అనుమతివ్వడం తెలిసిందే. పాలి, దౌసా జిల్లాల్లో మోదీ ఎన్నికల ర్యాలీల్లో మాట్లాడుతూ ‘ఇప్పుడు మీరెలా తప్పించుకుంటారో నేను చూస్తా. నాలుగు తరాలు దేశాన్ని పాలించిన కుటుంబాన్ని కోర్టుకు తీసుకొచ్చిన టీ అమ్మే వ్యక్తి ధైర్యాన్ని చూడండి’ అని మోదీ అన్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మైకేల్ క్రిస్టియన్‌ను యూఏఈ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన అంశాన్నీ మోదీ ప్రస్తావించి కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు. మైకేల్ నోరు తెరిస్తే తమ పేర్లు బయటకొస్తాయని గాంధీ కుటుంబం వణికిపోతోందనీ, ఇది వేల కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకున్న కుంభకోణమని మోదీ అన్నారు. ‘మైకేల్ రాజకీయ నేతలకు సేవలందించాడు. ఇప్పుడు ఆ రహస్యాలను బయటపెడతాడు. ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం’ అని మోదీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మంగళవారం రాజస్తాన్‌లోని కుంభారం ప్రాజెక్టును కుంభకర్ణ ప్రాజెక్టు అని తప్పుగా పలికారు. దీనిపై మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ అంతా అయోమయంలో కూరుకుపోయిన పార్టీ అనీ, అలాంటి పార్టీకి ఓట్లు వేయొద్దని కోరారు. గాంధీల కుటుంబం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందనీ, తమ పార్టీకి దేశమే కుటుంబమనీ, కాబట్టి మరోసారి రాజస్తాన్‌లో బీజేపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాజస్తాన్‌లో ముగిసిన ప్రచారం రాజస్తాన్‌లో గెలుపే లక్ష్యంగా బీజేపీ–కాంగ్రెస్‌ల మధ్య సాగిన హోరాహోరీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రానికి ముగిసింది. ఈ రాష్ట్రంలో మొత్తం 200 శాసనసభ నియోజకవర్గాలుండగా 199 నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. 199 మంది మహిళలు, 830 మంది స్వతంత్రులు సహా మొత్తం 2,274 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆళ్వార్ జిల్లాలోని రామగఢ్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందనీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాజస్తాన్ ముఖ్య ఎన్నికల అధికారి ఆనంద్ కుమార్ చెప్పారు. ఈ రాష్ట్రంలో మొత్తం 4.77 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 130 స్థానాల్లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉండనుంది. మరో 50 సీట్లలో ఇరు పార్టీల నుంచి తిరుగుబాటు అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. -
అగస్టా కేసు: త్యాగికి బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్‌లాండ్ మనీ ల్యాండరింగ్ కేసులో వైమానిక దళ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి, ఆయన సోదరులకు పటియాలా హౌస్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. రూ లక్ష వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు కోరింది. రూ 3600 కోట్ల అగస్టా ఒప్పందంలో పలు అక్రమ మార్గాల్లో కాంట్రాక్టును పొందేందుకు కోట్ల మొత్తం చేతులు మారాయని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో దాఖలైన చార్జిషీట్‌ను పరిశీలించిన అనంతరం కోర్టు ఎదుట హాజరు కావాలని 30 మందికి పైగా నిందితులకు ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ సమన్లు జారీ చేశారు. కాగా అగస్టా స్కామ్‌తో సంబంధం ఉన్న విదేశీ సంస్థలు, వ్యక్తులు బుధవారం కోర్టు ఎదుట హాజరుకాలేదు. భారత వైమానిక దళానికి 12 ఏడబ్ల్యూ-101 హెలికాఫ్టర్లను సరఫరా చేసేందుకు భారత ప్రభుత్వంతో 2010లో అగస్టావెస్ట్‌ల్యాండ్ రూ 3546 కోట్ల కాంట్రాక్టుపై సంతకాలు చేసింది. వీటిలో ఎనిమిది హెలికాఫ్టర్లు రాష్ట్రపతి, ప్రధాని వంటి వీవీఐపీల ప్రయాణానికి ఉద్దేశించినవి కావడం గమనార్హం. ఈ ఒప్పందంలో 34 మంది వ్యక్తులు, సంస్థలు అక్రమ పద్ధతుల్లో పాలుపంచుకున్నారని మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. త్యాగి భాగస్వామిగా ఉన్న కంపెనీ ఈ ఒప్పందంలో రూ కోటి ముడుపులు అందుకుందని ఈడీ చార్జిషీట్లో ఆరోపించింది. -
'ప్లీజ్.. అంటే సోనియా వింటుందా?'
న్యూఢిల్లీ: 'ప్లీజ్ సోనియా గాంధీ గారు.. హెలికాప్టర్ల స్కామ్ లో ఎంత డబ్బు తీసుకున్నారో చెప్పండి ప్లీజ్..! అని అడిగితే ఆవిడ నిజం చెబుతుందా? కచ్చితంగా చెప్పదు. అందుకే సోనియా గాంధీని అరెస్ట్ చెయ్యాలి. లాకప్ లో ఉంచి రెండంటే రెండు రోజులు విచారిస్తే నిజానిజాలు వాటంతట అవే తన్నుకొస్తాయి. కానీ సోనియాను జైల్లో పెట్టాల్సింది ఎవరు? అంత దమ్ము 56 ఇంచుల ఛాతీ ఉందని చెప్పుకునే నరేంద్ర మోదీకి ఉందా?' అంటూ ఒకేసారి అటు అధికార , ఇటు విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల స్కాంలో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం జంతర్ మంతర్ వద్ద ఆప్ నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. 'అగస్టా కుంభకోణంపై ఇటలీ కోర్టు ఇచ్చిన నివేదికలో సోనియా గాంధీతోపాటు ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ పేర్లు స్పష్టంగా ఉన్నాయి. ఇవి వెలుగులోకి వచ్చి నాలుగేళ్లు దాటింది. భారత్ ను అవినీతి రహిత దేశంగా మార్చుతామని, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి నరేంద్ర మోదీ రెండేళ్ల కిందట ఎన్నికల్లో గెలిచారు. మరి అగస్టా విషయంలో ఆయన ఇంతకాలం ఎందుకు సైలెట్ గా ఉన్నారు? ఆధారాలున్నా చర్యలు తీసుకోలేదెందుకు? అలాంటప్పడు సీబీఐ, ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు ఉండి లాభం ఏమిటి? వాటిని వెంటనే మూసేయండి' అని కేజ్రీవాల్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. భార్యాభర్తలు కీచులాడుకోరా? 'చిన్నచిన్న కేసులకే ఆమ్ ఆద్మీకి చెందిన ఎమ్మెల్యేలను జైళ్లలో పెట్టించిన మోదీ.. ఇంత పెద్ద స్కాం విషయంలో మౌనంగా ఉండటం ఆయన చేతగాని తనానికి నిదర్శనం. ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి, భార్యతో తగువులాడాడని ఐదురోజులు కటకటాల్లోకి నెట్టారు. ఏం.. భార్యా భర్తలు కీచులాడుకోరా? రేప్ ఘటనపై ఆందోళన చేసిన మరో ఎమ్మెల్యేని నాలుగు రోజులు బొక్కలో వేశారు. లంచంపై పోరాడిన ఓ ఆర్మీ ఆఫీసర్ ను రెండు రోజులు స్టేషన్ లో ఉంచారు. అయ్యా మోదీ గారు.. మీ ప్రతాపం చిన్నవాళ్లపైనేనా? పెద్దవాళ్ల జోలికి వెళ్లరా? లేక కాంగ్రెస్ వాళ్లతో పెట్టుకుంటే మీ కూసాలు కూడా కదలిపోతాయని భయమా?' అంటూ అగస్టా స్కాంలో సోనియాపై చర్యలకు వెనకాడుతున్న ప్రభుత్వం తీరును కేజ్రీవాల్ ఎండగట్టారు. హరియాణా, రాజస్థాన్ లలో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపణలున్నాయని, ఆ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీనే అధికారంలో ఉందని, అలాంటప్పుడు వాద్రాపై ఎంక్వైరీ ఎందుకు వేయడంలేదని అరవింద్ ప్రశ్నించారు.