వేలకోట్ల రూపాయలను ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఎట్టకేలకు చెక్ పడింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంతోంది. అయితే మాల్యాను ఇండియాకు రప్పించేందుకు తీవ్రంగా శ్రమించిన ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సీబీఏ చివరకు విజయం సాధించాయి. స్కాట్‌లాండ్ పోలీసులు లండన్ లో మంగళవారం ఉదయం ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం వెస్ట్ మినిస్టర్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మాల్యాను త్వరలోనే భారత్ కు తీసుకున్నారని తెలుస్తోంది. అయితే న్యాయపరంగా ఈ మొత్తం ప్రక్రియ ముగిసి మాల్యాను ఇండియాకు రప్పించేందుకు మరో నెల రోజులుపట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.