ఎర్రచందనం స్మగ్లర్లకు పోలీసులకు మధ్య కాల్పులు
Published Wed, Jul 30 2014 7:25 PM | Last Updated on Tue, Nov 6 2018 5:21 PM
కడప: అక్రమ ఎర్రచందనం సరఫరాకు పాల్పడుతున్న స్మగ్లర్లకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు బుధవారం సాయంత్రం జరిగాయి. వైఎస్ఆర్ జిల్లాలోని రైల్వేకోడూరు మండలం బాలపల్లి అటవీప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఎదురు కాల్పుల్లో తమిళనాడుకి చెందిన ఎర్రచందనం కూలీ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్మగ్లర్లు రాళ్లు రువ్వడంతో కాల్పుల జరిపామని పోలీసుల తెలిపారు.
Advertisement
Advertisement