అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు రైల్వేకోడూరులోని బాలుపల్లి చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు.
రైల్వే కోడూరు: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు రైల్వేకోడూరులోని బాలుపల్లి చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. షేక్ దర్బార్ బాషా, మన్నూరు హుస్సేన్ అనే ఇద్దరు ఎర్రచందనం దొంగలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఇద్దరూ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ హసన్ భాయ్ అనుచరులుగా గుర్తించారు. వీరి నుంచి 28 ఎర్రచందనం దుంగలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.