ఐదుగురు బడా స్మగ్లర్లపై పీడీ యాక్టు
– ఓఎస్‌డీ సత్య ఏసుబాబు వెల్లడి
కడప అర్బన్ : ఐదుగురు బడా ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టు ప్రయోగిస్తూ జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓఎస్‌డీ (ఆపరేషన్స్) బి.సత్య ఏసుబాబు సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్లు కర్ణాటక రాష్ట్రం కటిగెనహళ్లికి చెందిన షేక్ ఫయాజ్ షరీఫ్ అలియాస్ ఫయాజ్ అలియాస్ ఫయ్యో (40), బెంగళూరుకు చెందిన హెచ్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అలియాస్ ప్రవీణ్ (38), తుంకూరు జిల్లా సిరా పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ రెహ్మాన్, చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన కందస్వామి పార్తిబన్ అలియాస్ పార్తిపన్ (46) జిల్లాలోని బద్వేలుకు చెందిన రైస్‌మిల్ సుబ్బారెడ్డి అలియాస్ సుబ్బిరెడ్డి అలియాస్ గాజులపల్లి సుబ్బారెడ్డి (48)లపై పీడీ యాక్టు ప్రయోగించినట్లు ఓఎస్‌డీ తెలిపారు.
ఫయాజ్‌పై 71 కేసులు నమోదుకాగా వైఎస్సార్ జిల్లాలో 45, చిత్తూరు జిల్లాలో 26 కేసులు ఉన్నాయన్నారు. హెచ్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై 22 కేసులు, షేక్ అబ్దుల్ రెహ్మాన్‌పై 27 కేసులు, కందస్వామి పార్తిబన్‌పై 28 కేసులు, రైస్‌మిల్ సుబ్బారెడ్డిపై 20 కేసులు నమోదయ్యాయన్నారు.