బడా స్మగ్లర్ అరెస్ట్ | red sander smuggler purushotham reddy arrested | Sakshi
Sakshi News home page

బడా స్మగ్లర్ అరెస్ట్

Published Sat, Jul 25 2015 9:02 AM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం గోకులాపురం గ్రామంలో ఎర్రచందనం బడా స్మగ్లర్ పురుషోత్తంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రామచంద్రాపురం: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం గోకులాపురం గ్రామంలో ఎర్రచందనం బడా స్మగ్లర్ పురుషోత్తంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి ఇదే గ్రామంలో కూలీలను తరలిస్తున్న తుఫాన్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో కూలీలు పరారయ్యారు. కాగా, విచారణలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కోసమే పురుషోత్తంరెడ్డి వారిని తరలిస్తున్నట్టు తేలింది.

దీంతో శనివారం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం చెట్లను ధ్వంసం చేసి దుంగలను చెన్నైకు స్మగ్లింగ్ చేయడంలో పురుషోత్తంరెడ్డి ఆరితేరినట్టు సమాచారం. ఇతడిపై ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయి. తాజా సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement