purushotham reddy
-
శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!
వర్తమానంలోని అనేక సమస్యలకు చరిత్రలోనే మూలాలు ఉంటాయి. అటువంటి చరిత్రను పనికిమాలినదిగా భావించిన పాలకుల హయాంలో సమస్యలకు పరిష్కారాలు ఎలా లభిస్తాయి? కరవుకాటకాలతో వెనుకబడి పోయిన రాయలసీమ వెతలు ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉన్నాయి. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన ‘శ్రీబాగ్ ఒడంబడిక’లోని అంశాలను చిత్త శుద్ధితో అమలుకు ప్రయత్నించకపోవడమే ఈ నాటి రాయలసీమ దుఃస్థితికి ప్రధాన కారణం. ఒడంబడిక ప్రకారం దక్కిన రాజధాని ఎటూ చెయ్యి దాటిపోయింది. కనీసం అభివృద్ధికి కీలకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నా పూర్తవుతాయా?శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ ప్రజల భావోద్వేగాలతో పెనవేసుకున్న అనుబంధం. తొలి భాషా ప్రయుక్త రాష్ట్ర అవతరణకు మూలం. పాలకుల నిరాదరణకు గురైన ఈ ఒడంబడికకు నేటికి 87 సంవత్సరాలు. అప్పట్లో ప్రస్తుత తెలంగాణ నైజాం నవాబు పాలనలో ఉండేది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. భాషాభిమానం, రాజకీయ కారణాలతో తమిళుల ఆధిపత్యంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలనే ఆలోచన మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలలో వచ్చింది. ఈ క్రమంలో 1913 (బాపట్ల)లో తొలి ‘ఆంధ్ర మహాసభ’ జరిగింది. అది భాష, సాంస్కృతిక వికాసం కోసం పరితపించిన వేదిక అయినా... అంతర్లీనంగా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు ప్రాంతం విడిపోవాలని దీని నిర్వాహకులకు ఉండేది. కారణాలు ఏమైనా రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతినిధులు ప్రారంభంలో సమావేశాలకు హాజరు కాలేదు. అయితే రాయలసీమ భాగస్వామ్యం లేకుండా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి వేరుపడటం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ఆంధ్ర మహాసభ పెద్దలు సీమ ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడం కోసం 1917లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సీమలో పర్యటించిన అనంతరం జరిగిన సభలలో సీమ ప్రాంత ప్రతినిధులు పాల్గొన్నారు.మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోవాలన్న మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలతో సీమ ప్రాంత పెద్దలు గొంతు కలపలేదు. కారణం అప్పటికే ఆంగ్లేయుల పాలనలో ఉన్న ఆ ప్రాంతం... విద్యాపరంగా అభివృద్ధి చెందింది. అలాగే కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీల వల్ల సీమతో పోల్చుకుంటే అభివృద్ధిలో ముందు ఉన్నది. సమీపంలో ఉన్న మద్రాసు నగరాన్ని వదులుకుని అప్పటికే అభివృద్ధిలో మెరుగ్గా ఉన్న కోస్తా ఆంధ్రతో కలిసి రాష్ట్రంగా ఏర్పడటం సీమ పెద్దలకు ఇష్టం లేదు. ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో జరిగిన అనుభవా లతో అనుమానాలు పెరిగాయి. 1926 ఆంధ్రమహాసభ ఆంధ్రా యూనివర్సిటీనీ వెనుకబడిన అనంతపురంలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. మద్రాసు శాసనసభలో ఈ అంశంపై జరిగిన తీర్మానంలో తమిళ శాసన సభ్యులు పాల్గొన వద్దని ఆనాటి ముఖ్యమంత్రి సూచించారు.వాస్తవానికి ఆంధ్ర మహాసభ తీర్మానం ప్రకారం... కోస్తా, సీమ సభ్యులు అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు ఓటు వేయాలి. అందుకు భిన్నంగా మధ్య కోస్తా సభ్యులు విజయవాడలో ఏర్పాటు చేయాలని ఓటు వేశారు. అయితే ముఖ్యమంత్రి సూచనను పక్కన పెట్టి తమిళ శాసన సభ్యులు కొందరు సీమ సభ్యులకు అనుకూలంగా ఓటు వేయడంతో 25 – 35 ఓట్లతో అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు తీర్మానం చేశారు. ఆంధ్ర మహాసభ తీర్మానం, అసెంబ్లీ ఆమోదాన్ని కాదని విశాఖలో ఏర్పాటు చేసి తొలి ఉప కులపతిగా రాయలసీమ వారికి అవకాశం ఇచ్చారు. ఈ పరిణామంతో పప్పూరి రామాచార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి లాంటి వారు... ‘ఉంటే మద్రాసుతో కలిసి ఉందాము లేకపోతె రాయలసీమ రాష్ట్రంగా (ప్రస్తుతమున్న సీమ నెల్లూరు ప్రకాశం జిల్లా, కర్ణాటక లోని బల్లారితో సహా) విడిపోదాం’ అని ప్రతిపాదన చేశారు.ఇదంతా గమనిస్తున్న ఆంధ్రమహాసభలోని పెద్దలు చర్చల నిమిత్తం రెండు ప్రాంతాల సభ్యులతో ఒక కమిటీని నియమించారు. 1937 నవంబర్ 16న మద్రాసు నగరంలోని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం (శ్రీబాగ్)లో కమిటీ సమావేశమయ్యింది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం అవతరించిన తర్వాత పాలనా ప్రాధాన్యతలపై ఒక ఒప్పందం చేసుకున్నారు. అదే ‘శ్రీబాగ్ ఒడంబడిక’. కోస్తా, సీమ ప్రజల పోరాటం... మరో వైపు పొట్టి శ్రీరాములు దీక్ష–ఆత్మార్పణల ఫలితంగా భారత దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న అవతరించింది.శ్రీబాగ్ ఒడంబడికలోని ముఖ్యాంశాలు:1. ఒక ప్రాంతంలో రాజధాని, మరో ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. ఎంపిక చేసుకునే హక్కు రాయలసీమకు ఉండాలి. 2. కృష్ణా, తుంగభద్రలలో నీటి వినియోగంలో రాయలసీమకు వాటా కేటాయించాలి. అందుకనుగుణంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. 3. రెండు ప్రాంతాల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమానత్వాన్ని సాధించేందుకు విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆంధ్రా యూనివర్సిటీ కింద ఒక కేంద్రాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయాలి. 4. జనాభా లెక్కల ప్రకారం కాకుండా సీమ, కోస్తా ఆంధ్రకు సమానంగా నియోజక వర్గాల ఏర్పాటు చేయాలి.ఈ ఒప్పందం ప్రకారం 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. కానీ, 1956లో తెలంగాణను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడంతో రాజధాని రాయలసీమ నుంచి తెలంగాణకు మారింది. అలా శ్రీబాగ్ ఒప్పందానికి తూట్లు పడటం ప్రారంభమయ్యింది. రాయలసీమ అభివృద్ధిలో అతి ముఖ్యపాత్ర పోషించే నీటి ప్రాజెక్టులనన్నా పూర్తి చేస్తున్నారా అంటే అదీ జరగడం లేదు. అదేమంటే శ్రీబాగ్ ఒప్పందానికి చట్టబద్ధత లేదనీ, అది కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపుల మధ్య కుదిరిన ఒప్పందం అనీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తు న్నారు. నాటి కాంగ్రెస్ విభిన్న అభిప్రాయాలు ఉన్నవారి సంగమం. కమిటీ సభ్యులు కాంగ్రెస్‌లో ఉన్నంత మాత్రాన ఈ ఒప్పందం ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా తేల్చడం సమంజసమేనా?చదవండి: హానికరమైన కొత్త జాతీయవాదంమద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం విడిపోవడంలో సీమ ప్రజల త్యాగం ఉన్నది. ప్రస్తుత సీమలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన వారికి ఇప్పటికీ హైదరాబాద్ కన్నా చెన్నై నగరంతోనే అనుబంధం ఎక్కువ. తెలుగు రాష్ట్రం కావాలనే కోరిక పుట్టిన ప్రారంభంలోనే... తమిళులు మదురై కేంద్రంగా తమిళ రాష్ట్రం కోసం తీర్మానం చేశారు. దీనికి కారణం ఎప్పటికైనా చెన్నై తెలుగు వారిదే అవుతుందేమో అని వారి ఆలోచన. నిజానికి పప్పూరి రామా చార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి ప్రతిపాదన ప్రకారం రాయలసీమ రాష్ట్రం ఏర్పడి ఉంటే (ప్రస్తుత రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బళ్ళారి, చెన్నై సమీప జిల్లాలతో కలిపి) చెన్నై మహానగరం మనదే అయ్యేది. దీన్నిబట్టి సమీపంలోని చెన్నై నగరాన్ని వదులుకుని తెలుగు రాష్ట్రం కోసం సీమ ప్రజలు త్యాగం చేశారని అర్థం చేసుకోవాలి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం కారణంగా శ్రీబాగ్ ఒప్పందం అంటే రాయలసీమకు రాజధాని మాత్రమే ఆన్న ప్రచారం జరుగుతోంది. ఇది సరికాదు. మరి నీటి ప్రాజెక్టుల సంగతేమిటి? శ్రీశైలం ప్రాజెక్టు నీటిని సత్వరం అందిపుచ్చుకునే విధంగా సిద్ధేశ్వరం ఆలుగునూ, పోతిరెడ్డి పాడునూ వెడల్పు చేయడం; రాయలసీమ ఎత్తిపోతల పథకం, తుంగభద్ర నీటిని ఉపయోగించుకునే విధంగా గుండ్రేవుల, కుందూపై రిజర్వాయర్లు నిర్మించడం; గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడం; చెరువుల పునరుద్ధరించడం వంటి చర్యలే రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం. అందుకే రాయలసీమ సమగ్రాభివృద్ధి జరగాలి అంటే కచ్చితంగా శ్రీబాగ్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్రలపై సీమ ప్రాంత సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి అనుగుణంగా పై ప్రాజెక్టులు పూర్తి చేయాలి.శ్రీబాగ్ ఒడంబడికలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్ర నీటిని సీమకు అందించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. శ్రీబాగ్ ఒప్పంద స్ఫూర్తితో సీమ సమాజం ఇందుకోసం ముందుకు సాగాలి.- మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త -
Huzurabad: తెరపైకి పురుషోత్తంరెడ్డి పేరు.. ఎవరీయన?!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన హుజూరాబాద్‌లో దీటైన అభ్యర్థి కోసం టీఆర్ఎస్ అన్వేషణ సాగిస్తోంది. స్థానిక పరిస్థితులు, సామాజిక, రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా కమలాపూర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కీలక పాత్ర పోషించిన దివంగత నాయకుడు ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబాన్ని కూడా టీఆర్ఎస్ పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. దామోదర్‌రెడ్డి సోదరుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముద్దసాని పురుషోత్తం రెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన పురుషోత్తం రెడ్డికి నిజాయితీపరుడైన అధికారిగా పేరుంది. 2009లో మహబూబ్‌నగర్ ఎంపీగా కేసీఆర్ గెలిచిన తరువాత 2010లో ఆ జిల్లా కలెక్టర్‌గా పురుషోత్తం రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. మహబూబ్‌నగర్‌లో విధులు నిర్వర్తిస్తూనే రిటైర్డ్ అయిన తరువాత 2013లో పే రివిజన్ కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటైన వేములవాడ దేవాలయ అభివృద్ధి సంస్థ (వీటీడీఏ) చైర్మన్‌గా నియమితులై ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈటలకు ముద్దసానితో చెక్ పెట్టాలని.. రాష్ట్రంలో కీలకనేత అయిన ముద్దసాని దామోదర్ రెడ్డి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఈటల రాజేందర్ చేతిలో 2004లో ఓటమి చెందారు. ఆ తరువాత మళ్లీ తెరపైకి రాలేదు. 2008, 2010 ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, టీఆర్ఎస్ ప్రభంజనంలో ఈటలకు పోటీ ఇవ్వలేకపోయారు. దామోదర్ రెడ్డి మరణానంతరం ఆయన తనయుడు ముద్దసాని కశ్యప్‌రెడ్డి 2014లో హుజూరాబాద్ నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో దామోదర్ రెడ్డి సోదరుడైన పురుషోత్తం రెడ్డిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందని టీఆర్ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. హుజూరాబాద్‌లో బలమైన ‘రెడ్డి’ సామాజిక వర్గంతోపాటు ముద్దసాని కుటుంబం పేరు, మాజీ ఐఏఎస్ హోదా కలిసి వస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే.. నిఘా వర్గాల సమాచారంతోపాటు సొంతంగా టీఆర్ఎస్ చేయిస్తున్న సర్వేలో ముద్దసాని పురుషోత్తం రెడ్డి ఎంత వరకు ‘ఫిట్’ అవుతారో చూడాలి. ఆశల పల్లకిలో మరికొందరు.. హుజూరాబాద్‌లో ఈటలకు దీటైన అభ్యర్థి కోసం టీఆర్ఎస్ అన్వేషణ సాగిస్తున్న నేపథ్యంలో పలువురు నాయకులు పార్టీ టికెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఈటలపై పోటీ చేసిన వకుళాభరణం కృష్ణమోహన్ రావు 2014 నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఈటల ఎపిసోడ్ వెలుగులోకి వచ్చిన తరువాత కొద్దిరోజులుగా హుజూరాబాద్‌లోనే మకాం వేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీసీకి టికెట్టు ఇవ్వాల్సి వస్తే తనకే అవకాశం వస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. ‘రెడ్డి’ సామాజిక వర్గానికి టికెట్టు ఇవ్వాల్సి వస్తే హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎ.ప్రవీణ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నుంచి ఆయన కూడా టీఆర్ఎస్లో చేరారు. బీజేపీలోకి ఈటల రాకతో అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అవకాశం వస్తే టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే యోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి పేరు గతంలో ప్రచారంలోకి వచ్చినా, ఆయన కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని ఖరాఖండిగా చెపుతుండడం గమనార్హం. కౌశిక్‌కు వరుసకు సోదరుడు అయిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నుంచి వచ్చిన ఆదేశాలతో ఆయన కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. బీసీ అభ్యర్థికి సీటివ్వాల్సి వస్తే తన పేరు కూడా పరిశీలించాలని హుజూరాబాద్ సీనియర్ నాయకుడు పొనగంటి మల్లయ్య కూడా పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్లో ముద్దసాని చెరగని ముద్ర తెలుగుదేశం పార్టీ నుంచి 1985లో తొలిసారి కమలాపూర్ ఎమ్మెల్యేగా ముద్దసాని దామోదర్ రెడ్డి విజయం సాధించారు. తరువాత 1989, 1994, 1999లలో జరిగిన సాధారణ ఎన్నికల్లో సైతం ఆయన విజయపరంపర కొనసాగింది. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా, కరీంనగర్ టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయిన ఆయనకు తిరిగి విజయం దక్కలేదు. నియోజకవర్గంలోని మామిడాలపల్లికి చెందిన ముద్దసాని కుటుంబానికి స్థానికంగా మంచిపేరుంది. దామోదర్ రెడ్డి కరీంనగర్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కాగా ముద్దసాని దామోదర్ రెడ్డి రాజకీయాల్లో ఉండగా, ఆయన సోదరుడైన పురుషోత్తం రెడ్డి రాజకీయాలకు దూరంగా ప్రభుత్వ సర్వీసుల్లో కొనసాగారు. గ్రూప్ –1 అధికారి నుంచి ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు అప్పటి ఎంపీ కేసీఆర్‌తో మంచి సంబంధాలు కొనసాగించారు. 2012లోనే దామోదర్ రెడ్డి మరణించగా, పురుషోత్తం రెడ్డి మాత్రం రిటైర్డ్ అయిన తరువాత కూడా ప్రభుత్వానికి తన సేవలందిస్తున్నారు. చదవండి: తెలంగాణలో ఆత్మగౌరవం ప్రశ్నార్థకం: ఈటల -
ఆనాడు బాబుకు లేఖ రాయలేదా?
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానులు వద్దని.. అమరావతిలో మత్రమే రాజధాని ఉండాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పడం చాలా ప్రమాదకరమని మేధావుల ఫోరమ్ కన్వీనర్ పురుషోత్తమ్‌రెడ్డి అన్నారు. సోమవారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరగాలని నాడు శివరామకృష్ణన్.. చంద్రబాబుకు లేఖ రాయలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన 8 నగరాలు ఉండగా అమరావతి పేరుతో కొత్త నగరమెందుకని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి రూ. 6 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని 14వ ఆర్థిక సంఘానికి చంద్రబాబు తిరుపతిలో లేఖ ఇవ్వలేదా అని, మరి ఇప్పుడు అమరావతి కోసం ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఎలా చెబుతారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వనరులను తాకట్టు పెట్టి.. ఇప్పుడు అమరావతి నిర్మాణమంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా నష్టపోతాయన్నారు. అమవరావతి వెనుక అన్ని రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే కన్సిస్తున్నాయని, ఎంపిక చేసిన సంస్థలు, వ్యక్తుల కోసమే అమరావతి నిర్మాణం తప్ప... ప్రజల రాజధాని కాదని పేర్కొన్నారు. కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి నుంచి రాయలసీమ వ్యతిరేకి అని, నాడు వైఎస్సార్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వెడల్పు పెంచడానికి ప్రయత్నిస్తే బాబు అడ్డుకోలేదా అంటూ మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటిమట్టం కోసం వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలను ఆయన వ్యతిరేకించలేదా అని ప్రశ్నించారు. ప్రధాని శంఖుస్థాపన చేసిన అమరావతిని ఎలా మారుస్తారంటూ ప్రశ్నిస్తున్న చంద్రబాబు... మరి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేసిన మన్నవరాన్ని తరలించ లేదా అని ధ్వజమెత్తారు. రాయలసీమ టీడీపీ నేతలు అమరావతి బానిసలలా వ్యవహరిస్తున్నారని, బాబు పర్యటనలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పర్యటనలను అడ్డుకుంటామని, రూ. 25వేల కోట్లతో రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంఖుస్థాపనలు కూడా చేశారని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిని సాధిస్తాయన్నారు. -
బాబే జిల్లాకు శాపం
ముఖ్యమంత్రి జిల్లా అంటే రాష్ట్రానికే మార్గదర్శకంగా ఉండాలి. ప్రగతి పథంలో దూసుకుపోవాలి. ఆర్థికంగా బలోపేతం కావాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. చంద్రబాబునాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఫలితం లేకుండాపోయింది. ఆయన పాలన జిల్లాకు శాపంగా మారింది. తీరని కష్టనష్టాలే మిగిలాయి. వచ్చిన ప్రాజెక్టులకు నిధులు వెచ్చించక అటకెక్కించారు. ఉన్న ప్రాజెక్టులను సొంత ప్రయోజనాల కోసం మూయించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు వలసబాట పడుతున్నారు. టీటీడీలో ఉద్యోగాల ప్రకటన గాలికొదిలేశారు. జన్మనిచ్చిన మాతృభూమికి తీరని ద్రోహం చేశారు’ అని రాయలసీమ మేధావుల ఫోరం కో–ఆర్డినేటర్ ఎం.పురుషోత్తంరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల నేపథ్యంలో సీఎం తీరును ఎండగట్టారు. ప్ర: సహకార మాట ఎలా ఉంది? జ: చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ప్రభుత్వ సంస్థపై పడ్డారు. ఎక్కడా లేనివిధంగా జిల్లాలోని విజయడెయిరీ, చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని దశలవారీగా మూయించి రైతాంగానికి తీరని అన్యాయం చేశారు. ఈ రెండు జిల్లాలో ఉండి ఉంటే రైతులకు మంచి చేకూరేది. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారోలేదు గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ కూడా మూత పడేదిశగా అడుగులు వేస్తున్నారు. కొత్త వాటిని ఏర్పాటు చేయకపోగా ఉన్నవాటిని కుట్రపూరితంగా మూతవేయించి, ప్రైవేటు వ్యవస్థను పురమాయించారు. వైఎస్ జగన్‌తో మరోసారి సహకార వ్యవస్థపై జిల్లా ప్రజల్లో చర్చ మొదలైంది. అధికారంలోకి వస్తానే మూతపడిన సహకార వ్యవస్థను తెరిపిస్తానని మాట ఇచ్చారు. జగన్ వస్తే పాడి, వ్యవసాయ రంగం విరాజిల్లుతుందనే సంతోషంలో ప్రజలు ఉన్నారు. ప్ర: టీటీడీలో జిల్లా వాసుల హక్కులను కాలరాసిదెవరు? జ: జిల్లాకు చెందిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు 14 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ 14 ఏళ్లలో టీటీడీ ఉద్యోగాలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఏడాది కాలం పాటు సీఎం పదవిలో ఉన్న రోశయ్య హయాంలో టీటీడీలో ఉద్యోగాలు భర్తీ చేశారు. 8 వేల ఉద్యోగాలను భర్తీ చేసి ఉంటే అందులో 85 శాతం ఉద్యోగాలు జిల్లా వాసులకు దక్కేవి. ఇది చాలక ప్రజలు మన్నించని అతిపెద్ద తప్పిదానికి చంద్రబాబు నడుం బిగించారు. టీటీడీ ఉద్యోగాల భర్తీ 85 శాతం లోకల్‌గా జిల్లా వాసులకే దక్కేవి. చంద్రబాబు తొలి దఫా ముఖ్యమంత్రి అయిన రోజుల్లో రాయలసీమను లోకల్‌గా తీసుకొచ్చి ఉగ్యోగాల భర్తీలో జిల్లాకు తీరని అన్యాయం చేశారు. అంతటితో ఆగకుండా ఇటీవల రాయలసీమకు మరింత తీరని ద్రోహం చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. మెమో నంబర్ 49479ని తీసుకొచ్చి టీటీడీ ఉద్యోగాల భర్తీలో రాష్ట్రం మొత్తం ( 13 జిల్లాలు) లోకల్ పరిధిలోకి తీసుకొచ్చారు. అంటే ఎప్పుడైనా టీటీడీ ఉద్యోగాలను భర్తీ చేస్తే జిల్లా, సీమవాసులు లోకల్ స్థానాన్ని కోల్పోయేలా కుట్ర చేశారు. స్థానికత లేకుండా రాష్ట్రం మొత్తం లోకల్ పరిధిలోకి తీసుకువచ్చి జన్మనిచ్చిన మాతృభూమికి తీరని నమ్మక ద్రోహం చేశారు. సీఎం వివక్ష కారణంగా దీనిపై స్థానికులు పోరాడాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్ర: ప్రాజెక్టుల ప్రగతి ఎలా ఉందంటారు? జ: అనేక రాష్ట్రాలతో పోట్లాడి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీసిటీని జిల్లాకు తీసుకొచ్చారు. అలాంటి శ్రీసిటీని విచ్ఛిన్నం చేసిన ఘనుడు చంద్రబాబు. అంతటితో ఆగకుండా శ్రీసిటీ హక్కులను జిల్లాకు దూరం చేస్తూ ఎక్కడో ఉన్న నెల్లూరు పరిధిలోకి తీసుకెళ్లి జిల్లాకు తీరని నష్టం చేకూర్చారు. నెల్లూరు టీడీపీ నేతలకు తలొగ్గిన చంద్రబాబు జిల్లా భూభాగంలోని శ్రీసిటీని నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థలో కలిపేశారు. అలానే మన్నవరం, దుగరాజ పట్నం ప్రాజెక్టుల కోసం పోరాటం చేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదలయినా కేవలం వైఎస్‌కు మంచి పేరువస్తుందనే దుర్మార్గపు ఆలోచనతో వీటిని నిర్లక్ష్యంచేశారు. ఐదేళ్లలో పూర్తి కావాల్సిన ఈ భారీ ప్రాజెక్టులను అన్యాయంగా అడ్డుకున్నారు. ప్ర: హెచ్‌సీఎల్ రాకుండా అడ్డుకున్నారట? జ: హెచ్‌సీఎల్ జిల్లాలో ఏర్పాటై ఉండి ఉంటే టీటీడీ తరువాత మరో అతిపెద్ద సంస్థగా ఉద్యోగ అవకాశాలతో పాటు ఆర్థిక సంస్థగా విరాజిల్లేది. ఈ సంస్థను తిరుపతిలో ఏర్పాటు కాకుండా అమరావతికి తరలించి జిల్లా వాసులను నిలువునా మోసం చేశారు. వేల కోట్ల ఈ ప్రాజెక్టును విజయవాడలో ఏర్పాటు చేయాలని అక్కడి నేతల ఒత్తిడి మేరకు చంద్రబాబు తలొగ్గి ఇంతటి ద్రోహానికి ఒడిగట్టారు. హెచ్‌సీఎల్ చైర్మన్ శివనాడార్ తిరుపతిలో ఏర్పాటుకు మొగ్గు చూపుతూ ఏకంగా ప్రకటన కూడా చేశారు. ఏకంగా చైర్మన్‌ను తప్పుపట్టి ఈ ప్రాజెక్టును జిల్లాకురాకుండా అడ్డుకోవడం నీచాతి నీచం. ప్ర: నీటి కేటాయింపులను చట్టపరం చేస్తారా? జ: పట్టిసీమను ఏడాదిలో కట్టానని చెప్పుకునే చంద్రబాబు జన్మనిచ్చిన ఈ గడ్డలో ఏళ్ల తరబడి నీటి అవసరాల కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోసం ఎందుకు ఏమీ కట్టలేకపోయారు. 230 కిలో మీటర్ల పనులు వైఎస్ హయాంలో పూర్తి చేసిన హంద్రీ–నీవాను మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ఐదేళ్లుగా నాన్చుతూ వచ్చారు. గాలేరి–నగరి డిజైన్లు మార్చుతూ కాలయాపన ఎందుకు చేస్తున్నారో, పట్టిసీమ తరహాలో ఏడాదిలో ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో చంద్రబాబు చెప్పాలి. హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచకుండా, నీటి కేటాయింపుల్లో చట్టపరంగా వాటా తీసుకురాకుండా సీమకు నీళ్లు ఇచ్చామంటే ఇక్కడ ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని గుర్తించాలి. సీమ, జిల్లాపై ప్రేమ ఉంటే నీటి కేటాయింపులను చట్టపరం ఎందుకు చేయలేదో చెప్పాలి. కేంద్ర నాబార్డు సంస్థ జిల్లా నీటి అవరాల కోసం కండలేరు రిజర్వాయర్ నిర్మాణం కోసం రూ.7 కోట్లు కేటాయిస్తే నెల్లూరు జిల్లా నేతల ఒత్తిడి కారణంగా ఈ ప్రాజెక్టును రాకుండా అడ్డుకున్న ఘనత చంద్రబాబుది. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాకు చంద్రబాబు చేసిన కుట్ర, ధగా ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి చంద్రబాబు జిల్లాకు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును తీసుకొచ్చి న దాఖలాలు లేవు. ప్ర: బాబు పాలనపై మీ అభిప్రాయం జ: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన జిల్లా ప్రజలకు శాపమనే చెప్పాలి. ఎక్కడై నా ఓ వ్యక్తి సీఎం లాంటి ఉన్నత పదవిలో ఉంటే ఆ.. ప్రాంతంగానీ, ఆ ఊరుగానీ అభి వృద్ధితో పాటు అన్నిరంగాల్లో అగ్రస్థా నంలో ఉంటుంది. అయితే చిత్తూరు జిల్లాకు వచ్చే సరికి ఆ పాలన శాపంగా మారింది. జిల్లాకు చెందిన చంద్రబాబుకు 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఇన్నాళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి జిల్లాను సస్యశ్యామలం చేయాల్సిందిపోయి తీరని అన్యాయం చేశారు. సహకార వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు. జిల్లాకు కేటాయించిన అనేక ప్రాజెక్టులను మరో ప్రాంతానికి తరలించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా జిల్లాకు దక్కాల్సిన హక్కులు, వాటాలు, ప్రాజెక్టులు దక్కకపోగా ఉద్యోగాలు సైతం కోల్పోవాల్సిన దుస్థితి ఎదురుకావడం సిగ్గుచేటు. ఉన్న ప్రాజెక్టులను అటకెక్కించగా మంజూరైన వాటిని మరో ప్రాంతానికి తరలించిన చర్రిత చంద్రబాబుదని రాయలసీయ మేధావుల ఫోరం కో–ఆర్డినేటర్ ఎం.పురుషోత్తంరెడ్డి ధజ్వమెత్తారు. చంద్రబాబు వల్ల జిల్లాకు జరిగిన నష్టం, చేసిన తప్పిదంపై ఆయన మండిపడ్డారు. ప్ర: మెడికల్ విద్యార్థులకు అన్యాయం జరిగిందంటారు నిజమేనా? జ: స్విమ్స్‌కు అనుబంధంగా ఉన్న పద్మావతి మెడికల్ కళాశాలలో మెడికల్ సీట్ల విషయంలోనూ జిల్లాకు నష్టం చేకూరేలా చంద్రబాబు కుట్ర చేశారు. ఎíస్వీ యూనివర్సిటీ పరిధిలో మెడికల్ సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా ఆంధ్రావర్సిటీ పరిధిలోని మెడికల్ సీట్లను 85 శాతం అక్క డి విద్యార్థులకే కేటాయిస్తున్నారు. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు రాష్ట్రం మొత్తం లోకల్ పరిధిలోకి తీసుకొచ్చి మూడో కంటికి తెలియకుండా దొడ్డిదారిన తీసుకొచ్చిన జీఓతో మెడికల్ సీట్లు భర్తీ చేసి మూడు జిల్లాల విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు. ఆపై న్యాయస్థానంలో పోరాడి మన హక్కులను సాధించుకుని రెండో ఏడాది నుంచి రావాల్సిన సీట్లను సాధించుకున్నాం. క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌నూ అడ్డుకున్నాడు.. ముంబైలో తప్ప మరెక్కడా లేని జాతీయ క్యాన్సర్ పరిశోధన కేంద్రం యూపీఏ హయాంలో తిరుపతికి మంజూరైంది. 2014లో కేంద్రమంత్రి జైరాం రమేష్ శంకుస్థాపన చేసిన క్యాన్సర్ పరిశోధన కేంద్రాన్ని చంద్రబాబు అమరావతికి తరలించి జిల్లా ప్రజలను వంచించారు. చరిత్ర హీనుడుగా మిగిలిపోయారు. ఈ పరిశోధనా కేంద్రం ఇక్కడ ఏర్పాటై ఉండి ఉంటేæ అనుబంధంగా మరిన్ని సంస్థలు వచ్చుండేవి. -
ఆ ఆస్తుల వెనుక ఎందరు?
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి కేసులో ఏసీబీ ఆయన బినామీలపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఆయనకు బినామీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యాదవరెడ్డి, నిషాంత్‌రెడ్డిలను మూడో రోజు కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఇప్పటివరకు ఏసీబీ నిర్వహించిన దాడుల్లో పలు భూములకు చెందిన డాక్యుమెంట్లు, మూసాపేట, అమీర్‌పేట, సోమాజీగూడల్లోని కమర్షియల్ కాంప్లెక్స్‌ల పత్రాలను స్వాధీనం చేసుకుంది. అలాగే అల్లుడు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పురుషోత్తంరెడ్డి రూ. 30 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది...కాంప్లెక్స్‌లను ఎప్పుడు, ఎవరి నుంచి కొన్నారు...వాటిని ఎవరు పర్యవేక్షిస్తున్నారు...నిషాంత్‌రెడ్డి బినామీగా నడిపిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలోకే డబ్బు రావడం వెనకున్న ఆంతర్యం ఏమిటి అనే అంశాలపై ఏసీబీ ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కూతురుకు రూ. 3.2 కోట్ల విలువైన ఓ భవనం గిఫ్ట్ డీడ్‌గా చేసిన విషయాలపైనా ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రధాన బినామీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి వ్యాపారాలు, అందులో పురుషోత్తంరెడ్డి పెట్టిన పెట్టుబడులు, ఇతర ఆదాయ వ్యవహారాలపై యాదవరెడ్డితోపాటు నిషాంత్రెడ్డిని ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పటివరకు బయటపడ్డ ఆస్తుల్లో బినామీలుగా వ్యవహరిస్తున్న వారి వాటా? బినామీలు చేస్తున్న వ్యాపారాల్లో పురుషోత్తంరెడ్డి వాటా ఎంత అన్న అంశాలను ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. మిగతా ఆస్తులపైనా... ఇప్పటివరకు రూ. 45 కోట్ల వరకు ఆస్తులున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు మిగతా ఆస్తులపైనా యాదవరెడ్డి, నిషాంత్‌రెడ్డిలను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లోనూ పురుషోత్తంరెడ్డి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై వారి నుంచి ఏసీబీ స్పష్టత తీసుకున్నట్లు తెలియవచ్చింది. కుమార్తె వివాహం సందర్భంగా కొన్న వజ్రాభరణాలకు డబ్బు ఎక్కడిదిన్న అంశాలపై పదే పదే ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీకి చెందిన ఓ శాసనసభ్యుడికి, పురుషోత్తంరెడ్డికి ఉన్న లింకులేంటి... వాటి వెనకేమైనా ఆర్థిక లావాదేవీలున్నాయా అనే అంశాలపైనా లోతుగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా పురుషోత్తంరెడ్డి బినామీ శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో సోమవారం ఏసీబీ సోదాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కోర్టు నుంచి అనుమతి పొందిన ఏసీబీ సోదాలు నిర్వహించి మరిన్ని కీలక ఆస్తుల వివరాలు సంపాదించే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. -
బడా స్మగ్లర్ అరెస్ట్
రామచంద్రాపురం: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం గోకులాపురం గ్రామంలో ఎర్రచందనం బడా స్మగ్లర్ పురుషోత్తంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి ఇదే గ్రామంలో కూలీలను తరలిస్తున్న తుఫాన్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో కూలీలు పరారయ్యారు. కాగా, విచారణలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కోసమే పురుషోత్తంరెడ్డి వారిని తరలిస్తున్నట్టు తేలింది. దీంతో శనివారం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం చెట్లను ధ్వంసం చేసి దుంగలను చెన్నైకు స్మగ్లింగ్ చేయడంలో పురుషోత్తంరెడ్డి ఆరితేరినట్టు సమాచారం. ఇతడిపై ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయి. తాజా సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.