పర్లాకిమిడి: శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వజ్రపు కొత్తూరు మండలం వెంకటాపురం వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం తనిఖీలు చేపట్టిన పోలీసులకు స్కార్పియోలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు కనిపించాయి. సుమారు 390 కిలోల బరువైన 11 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవిప్రసాద్, అజయ్, మహంతి అనే వ్యక్తులను అరెస్ట్ చేసి ఒడిస్సా పోలీసులకు అప్పగించారు. దుంగలను పర్లాకిమిడి నుంచి ఒడిశా వైపు తరలిస్తున్నట్లు తేలింది. ఈ కేసును పర్లాకిమిడి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేశారు.