వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణ సమీపంలోని వై.కోట బైపాస్ వద్ద ఓబులవారిపల్లె మండలం మంగళంపల్లె వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఒకరు అక్కడికక్కడే చనిపోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రైల్వేకోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆటో, బస్సు ఢీకొని ఒకరు మృత్యువాత
Published Thu, Feb 11 2016 1:20 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement