హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కారును అనంతరాజుపేట వద్ద ఓ కంటైనర్ ఢీకొంది.
- కారును ఢీకొన్న కంటైనర్.. ముగ్గురి మృతి
రైల్వే కోడూరు: పుణ్య క్షేత్రానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని అనంతరాజుపేట వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కారును అనంతరాజుపేట వద్ద ఓ కంటైనర్ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరిని తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.అయితే మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.