సాక్షి, కడప: జననేత జగన్ తమ మధ్యకు వస్తున్నాడని తెలియగానే జిల్లా వాసుల్లో ఆనందం తారాజువ్వై నింగికెగిసింది. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, రాయచోటి, పులివెందుల, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, పోరుమామిళ్ల, మైదుకూరుతో పాటు ప్రతి పల్లెలో సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీ కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు, రైతులు, వ్యాపారులు, విద్యార్థులు ముఖ్యంగా మహిళలు పండుగ చేసుకున్నారు. రంగులు చల్లుకుంటూ, డ్యాన్స్‌లు చేస్తూ జగన్నామస్మరణలో మునిగిపోయారు. పులివెందులలో ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి, జిల్లా మునిసిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నింగినంటేలా సంబరాలు జరిగాయి. జగన్ ఆఫీసు, పూల అంగళ్ల సర్కిల్ మీదుగా ఎవరికి వారు ర్యాలీలు చేస్తూ ఆర్టీసీ బస్టాండ్ వద్ద అందరూ గుమికూడారు.
రంగులు చల్లుకున్నారు. గంగిరెడ్డి, శంకర్‌రెడ్డిని చేతులపై ఎత్తుకుని ఊరేగించారు. రైతులు పట్టణంలోకి ఎద్దుల బండ్లను తీసుకొచ్చి ‘ఆనందర్యాలీ’ చేశారు. యువకులు బైక్‌లకు సెలైన్సర్లు తీసి పట్టణంలోని వీధుల్లో చక్కర్లు కొట్టారు. మహిళలు డ్యాన్స్‌లు చేస్తూ ఆనందసాగరంలో మునిగిపోయారు. వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఎర్రగుంట్లలో జగన్ అభిమానులు వైఎస్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. భారీ ర్యాలీ నిర్వహించి బాణసంచాతో హోరెత్తించారు. డేవిడ్ అనే అభిమాని వైఎస్ పటం ముందు తలనీలాలు సమర్పించారు. వై. వీరభద్రారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్‌చేశారు.
కడప అప్సర సర్కిల్‌లో జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు బాణసంచా పేల్చి సంబరాలు చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నేతలు అప్జల్‌ఖాన్, హఫీజుల్లా, నిత్యానందరెడ్డి, భరత్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పత్తి రాజేశ్వరి, బోలా పద్మావతి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. అక్కడి నుండి ర్యాలీగా కోటిరెడ్డి సర్కిల్‌కు చేరుకున్నారు. కోటిరెడ్డి సర్కిల్‌లో బాణసంచా పేల్చి ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. ఏడు రోడ్ల వరకూ ర్యాలీ చేశారు. మాసీమ సర్కిల్‌లో మాసీమబాబు సంబరాలు చేశారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. అందరూ కలెక్టరేట్‌వ వద్ద ఉన్న వైఎస్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. వైఎస్ విగ్రహానికి సురేష్‌బాబు పూలమాల వేశారు. చింతకొమ్మదిన్నె మండల కన్వీనర్ బాలమల్లారెడ్డి సీకే దిన్నె సర్కిల్‌లోని వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రొద్దుటూరులో పార్టీ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈవీ సుధాకర్‌రెడ్డి, గరిశపాటి లక్ష్మిదేవితో పాటు పలువురు నేతలు సంబరాలు చేసుకున్నారు. పోరుమామిళ్లలో మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో జగన్‌కు బెయిల్ రావాలని సోమవారం ఉదయం వెంకటేశ్వరస్వామి దేవాలయంలో 108 కొబ్బరికాయలు కొట్టారు. బెయిల్ వచ్చిన తర్వాత ర్యాలీ నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. బద్వేలు నాలుగురోడ్ల కూడలిలో మాజీ మునిసిపల్ చైర్మన్ మునెయ్య,గురుప్రసాద్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచారు. యువజన విభాగం నాయకుడు ఓబుళ్‌రెడ్డి ఆధ్వర్యంలో కిలోమీటరు మేర బాణసంచా కాల్చారు. జమ్మలమడుగులో పార్టీ సమన్వయకర్త సూర్యనారాయణరెడ్డి, శివనాథరెడ్డి, ఎమ్మెల్సీనారాయణరెడ్డి తనయుడు భూపేశ్‌రెడ్డి, హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ చిత్రపటానికి 101 టెంకాయలు కొట్టారు. మైదుకూరులో పార్టీ నేతలు మదీనా దస్తగిరి, షౌకత్ అలీ నేతృత్వంలో భారీ ఎత్తున బాణసంచా పేల్చారు.
జిల్లా అంతటా సంబరాలు
Published Tue, Sep 24 2013 3:41 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement